Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది ఘోస్ట్ కోసం దుబాయ్ ఎడారిలో బైక్ ఛేజింగ్ చేస్తున్న నాగార్జున

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (16:47 IST)
Nagarjuna Action still
అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారుల హై బడ్జెట్  యాక్షన్ ఎంటర్‌టైనర్ `ది ఘోస్ట్` షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభమైంది. ఇది సుదీర్ఘమైన షెడ్యూల్. సినిమాలోని ప్రముఖ తారాగణం పాల్గొనే చాలా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్‌లో నాగార్జున సరసన కథానాయికగా నటించడానికి ఎంపికైన సోనాల్ చౌహాన్ కూడా బృందంతో జాయిన్ అయింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లోని కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను కూడా టీమ్ నేడు విడుద‌ల‌జేసింది.
 
Nagarjuna Action still
ప్రస్తుతం దుబాయ్‌లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. ద‌ర్శ‌కుడు ప్ర‌వీన్ ట్విట్ట‌ర్‌లో యాక్ష‌న్ స్టిల్స్‌ను పోస్ట్ చేశాడు. ఇసుక‌లో బైక్ ఛేజింగ్ సీన్ కోసం ఫైట్ మాస్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుని ప్ర‌త్యేక‌మైన డ్రెస్‌తో నాగార్జున క‌నిపిస్తున్నాడు. నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే.   ఈ సినిమాలో నాగార్జున యాక్షన్ పాత్రలో నటిస్తున్నారు.
 
శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ముఖేష్ జి కెమెరా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్, రాబిన్ సుబ్బు, నభా మాస్టర్ స్టంట్ డైరెక్టర్లు.
 
తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments