Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ రికార్డ్‌ని బ్రేక్ చేసిన నాగ్... ఇంత‌కీ ఏంటా రికార్డ్..?

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (18:23 IST)
బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2.. ఈ రెండు సీజ‌న్స్ విశేషాద‌ర‌ణ పొంద‌డంతో.. బిగ్ బాస్ 3పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. అయితే... ఈ రియాల్టీ షో ప్రారంభం కాక ముందే వివాదాలు రావ‌డంతో అస‌లు షో స్టార్ట్ అవుతుందా..? వాయిదా ప‌డుతుందా..? అనే అనుమానాలు వచ్చాయి. ఆఖ‌రికి అనుకున్న ప్ర‌కార‌మే షో స్టార్ట్ అయ్యింది.
 
ఇక నాగ్ త‌న‌దైన స్టైల్లో హోస్ట్‌గా అదర‌గొట్టేస్తున్నాడు. దీంతో ఓ స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే... ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు 16.18 రేటింగ్‌ రాగా, నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌కు ఫస్ట్‌ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్ వచ్చింది.

వీళ్లిద్దరినీ క్రాస్ చేసి నాగ్‌ తొలి ఎపిసోడ్‌కు 17.92 రేటింగ్‌ సాధించి టాప్‌ ప్లేస్‌లో నిలిచి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు. జులై 21న ప్రారంభ‌మైన ఈ షో రోజురోజుకు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని పెంచుతుంది.

బిగ్ బాస్ హౌసులోకి సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరను ఏలుతున్న నటుల్లో ఒకడు సుడిగాలి సుధీర్. ప్రస్తుతం ఇతడు బిగ్ బాస్ హౌజ్‌లోకి రాబోతున్నాడని తెలిసింది. 'సాఫ్ట్‌వేర్ సుధీర్' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
 
ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన సుధీర్.. ఇందుకోసం బిగ్‌బాస్ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్నాడు. త్వరలోనే బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన సినిమాను ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు. 
 
ఇకపోతే.. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయినవారిలో చమ్మక్ చంద్ర, షకలక శంకర్ హీరోలుగా ఇప్పటికే తమ అద‌ృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ సక్సెస్ మాత్రం కాలేకపోయారు. ఇప్పుడదే దారిలో సుడిగాలి సుధీర్ కూడా వెళ్తుండటంతో.. హీరోగా సుధీర్ ప్రేక్షకులను మెప్పిస్తాడా లేడా అన్న ఆసక్తి నెలకొంది. ఇందుకు బిగ్ బాస్ షో ఎంతవరకు లాభిస్తుందనేది వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాకు జయమంగళ రాజీనామా.. పెద్దకర్మ పోస్ట్.. బాబుకు పవన్ గౌరవం ఇస్తారా?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

వాయనాడ్‌‌లో ప్రియాంక గాంధీ ఘనవిజయం.. రాహుల్ రికార్డ్ బ్రేక్

'మహాయుతి' అదుర్స్.. మోదీ, అమిత్ షా, చంద్రబాబు అభినందనలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments