Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్3లో నాగార్జున.. కోడలిగా గర్వంగా వుంది.. సమంత (video)

Advertiesment
బిగ్ బాస్3లో నాగార్జున.. కోడలిగా గర్వంగా వుంది.. సమంత (video)
, శుక్రవారం, 2 ఆగస్టు 2019 (16:30 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బిగ్ బాస్ మూడో సీజన్‌పై స్పందించింది. తన మామగారైన కింగ్ నాగార్జున బిగ్ బాస్ మూడో సీజన్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది.


తెలుగు, తమిళ టీవీ స్క్రీన్లపై ఈ షో దాడి చేస్తుందని సమంత చెప్పింది. బిగ్ బాస్ షో కోసం ప్రేక్షకులు ఎగబడుతున్నారని.. టీవీలకు అతుక్కుపోతున్నారని చెప్పింది. 
 
ఈ షోలో నాటకాలు భలేగున్నాయని వెల్లడించింది. ఈ సీజన్‌ను టాలీవుడ్‌లోని అత్యుత్తమ నటులలో ఒకరైన నాగార్జున నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ షో ప్రదర్శన ఆకట్టుకుంటోంది. 
 
అయినప్పటికీ ప్రసారమైన స్వల్ప వారాల్లోనే టీఆర్పీ రేటింగ్ బాగా పెరిగిందని నివేదికలు వస్తున్నాయి. తాజాగా ఈ షో ద్వారా టీఆర్పీ రేటింగ్ 17.92తో బిగ్ బాస్ తెలుగు 3 రికార్డులన్నీ బద్దలు కొట్టారని గుర్తు చేసింది. నాగార్జునకు తాను కోడలు కావడాన్ని గర్విస్తున్నానని చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దమ్ముంటే అమల, సమంతలను బిగ్ బాస్ షోకు పంపించాలి: శ్వేతారెడ్డి సవాల్