Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్ ఇండియా మూవీగా నాగ చైతన్య - సాయిపల్లవి 'తండేల్'

ఠాగూర్
సోమవారం, 30 సెప్టెంబరు 2024 (20:15 IST)
పాన్ ఇండియా మూవీగా నాగ చైతన్య - సాయిపల్లవి 'తండేల్'  అని ఆ చిత్ర దర్శకుడు చందూ మొండేటి తెలిపారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతోంది. డి.మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తండేల్ రూపొందిస్తున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నిజమైన సంఘటనలే అయినప్పటికీ, ఇద్దరు ప్రేమికుల మధ్య వారి జీవితాల్లో సంభవించిన పరిస్థితులు, భావోద్వేగాలు, సందర్భాలు చాలా గ్రిప్పింగ్, ఆకర్షణీయంగా తెరపై దర్శకుడు చందు మొండేటి మలిచారు. ఇందులోభాగంగా, మేకర్స్ శ్రీకాకుళం గొప్ప వారసత్వం యొక్క ముఖ్యమైన అంశాన్ని ఈ సినిమాలో చుపించారు. 
 
శ్రీ ముఖలింగం యొక్క పురాతన శివాలయం, ఈ ఆలయం మహా శివరాత్రి రోజు గొప్ప పండుగను నిర్వహిస్తారని తెలిపారు. అపారమైన భక్తి, సంప్రదాయం, వైభవంతో జరుపుకుంటారని, దీని ప్రేరణతో, టీమ్ సినిమా కోసం అద్భుతమైన, మునుపెన్నడూ చూడని శివరాత్రి పాటను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 
 
శివరాత్రి ఉత్సవ వైభవాన్ని తెలియజెసేలా భారీ సెట్టింగ్‌లు, అత్యంత వ్యయంతో ఈ పాటను చిత్రీకరించారు. దేవి శ్రీ ప్రసాద్ ఒక క్లాసిక్‌ పాటను కంపోజ్ చేయగా, శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారని తెలిపారు. ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి, వేలాది మంది డ్యాన్సర్‌లతో కలిసి నటించారని వెల్లడించారు.  
 
ఈ అద్భుతమైన శివరాత్రి పాటను ప్రేక్షకుల ముందుకు దసరా సందర్భంగా తీసుకురావడానికి టీమ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాంగ్ షూట్ నుండి రెండు పోస్టర్లను మేకర్స్ విడుదల చేసారని తెలిపారు. కాగా, తండేల్‌ను సంక్రాంతి‌కి విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారికంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. మళ్లీ సీన్‌లోకి "డయల్ యువర్ సీఎం"

ఉద్యోగులకను డేటింగ్‌కు ప్రోత్సహిస్తున్న చైనా కంపెనీ... పార్ట్‌నర్‌ను వెతికిపెట్టినా సరే...

ఏపీ ఎన్నికల్లో నిజమైంది.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కేకే ఏమంటోంది?

ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపిస్తారా? గరికపాటి పాత వీడియో వైరల్

ఓరి నాయనో అదానీపై కేసుకు ఆంధ్రప్రదేశ్‌కు లింక్... భారీగా ముడుపులిచ్చారట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments