1551 నుంచి మగవాడి ప్రయాణం అంటూ 'శ్వాగ్' ట్రైలర్ ప్రారంభమవుతుంది. స్వాగనిక రాజవంశంలో ప్రతి రాజు వారసుడిని కలిగి ఉండాలని కోరుకుంటాడు. అయితే, 1970ల నుండి ఈ వంశానికి చెందిన యయాతి సాదాసీదా జీవితాన్ని గడుపుతాడు. అతనికి కుమార్తెలు మాత్రమే వుంటారు. మరొక యుగానికి చెందిన భవభూతి, సింగ తన వారసుడిని తెలుసుకుంటాడు. రాజవంశం నిధిని అప్పగించడం అతని బాధ్యత. అయితే, వింజమర రాణి దిన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది.
విభిన్న టైమ్‌లైన్‌లలో సెట్ చేయబడిన కథ, జెండర్ గేమ్స్ ని ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ప్రజెంట్ చేసింది. దర్శకుడు హసిత్ గోలి ఈ ట్రైలర్ ద్వారా ప్లాట్‌ను క్లారిటీ, ఇన్ సైట్ తో అందించారు. శ్రీవిష్ణు 4 డిఫరెంట్ గెటప్‌లలో అద్భుతమైన నటన కనబరిచారు. భిన్నమైన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ లతో అలరించారు. భవభూతి పాత్ర ఎక్స్ ట్రార్డినరీ గా వుంది.
శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి 'రాజ రాజ చోర' తర్వాత యూనిక్ ఎంటర్‌టైనర్ 'శ్వాగ్' తో అలరించడానికి రెడీ అయ్యారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో 4 రోజుల్లో సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
రీతూ వర్మకు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. మీరా జాస్మిన్ తన రీఎంట్రీలో చేస్తున్న చిత్రంలో చాలా కీలక పాత్రను పోషించింది. దక్ష నగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. అక్టోబర్ 4న విడుదల కానున్న ఈ సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ అల్టిమేట్ డోస్ ట్రైలర్‌తో అంచనాలని మరింతగా పెంచింది.