Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్వాగ్ చిత్రంలో విభిన్న పాత్ర పోషిస్తున్న శ్రీవిష్ణు

Sree Vishnu

డీవీ

, శుక్రవారం, 14 జూన్ 2024 (17:32 IST)
Sree Vishnu
వెరైటీ సబ్జెక్ట్‌లతో అలరిస్తున్న శ్రీవిష్ణు కింగ్ ఆఫ్ కంటెంట్ అని ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రతి సినిమాలోనూ కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేలా చూసుకుంటూ డిఫరెంట్ స్క్రిప్ట్‌లను ఎంచుకుంటున్నారు. హసిత్ గోలీ దర్శకత్వంలో చేస్తున్న తన అప్ కమింగ్ యూనిక్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ 'శ్వాగ్'లో హిలేరియస్ రోల్ లో కనిపించనున్నారు. శ్వాగ్ శ్రీ విష్ణు, హసిత్ గోలీల నుండి మరొక యూనిక్ అటెంప్ట్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
సినిమాలోని అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసిన తర్వాత మేకర్స్ రేజర్ టీజర్ ని రిలీజ్ చేశారు. శ్రీవిష్ణు మగవారి గురించి స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో వీడియో ప్రారంభమవుతుంది. శ్రీవిష్ణు భవభూతి అనే మగ చావినిస్ట్ క్యారెక్టర్ పోషించారు. అతని లుక్స్, టెర్రిఫిక్ మేక్ఓవర్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.
 
శ్రీవిష్ణు అద్భుతమైన చరిష్మా తో అందరిద్రుష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అతని క్యారెక్టర్  ప్రేక్షకులను రెండుగా డివైడ్ చేస్తుంది. అతన్ని ప్రేమించినా, ద్వేషించినా, మీరు భవభూతిని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. టీజర్ హైలీ ఎంటర్టైనింగ్ గా ఉంది. హసిత్ గోలీ రైటింగ్ హిస్టీరికల్‌గా ఉంది, అతని డైరెక్షన్ అద్భుతంగా ఆకట్టుకుంది.
 
వింజమర వంశంలో క్వీన్ రుక్మిణి దేవిగా రీతూ వర్మ నటిస్తోంది. ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ డీవోపీగా పని చేస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు, విప్లవ్ నిషాదం ఎడిటర్. జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్. నందు మాస్టర్ స్టంట్స్‌ నిర్వహిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.
 
త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. శ్వాగ్ విడుదలకు సిద్ధమవుతోంది.
 
నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాందిని చౌద‌రి న‌టించిన యేవ‌మ్ ఎలా వుందంటే.. రివ్యూ