Webdunia - Bharat's app for daily news and videos

Install App

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

దేవీ
శనివారం, 17 మే 2025 (10:39 IST)
Praveen, maruti and team
పలు విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌',   ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు మారుతి ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ ''భకాసుర రెస్టారెంట్‌ త్వరలో మీ ముందుకు రాబోతుంది. మా ట్రైలర్‌ మారుతి గారి చేతుల మీదుగా విడుదల కావడం హ్యపీగా ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం నా కెరీర్‌ సెట్‌ కావడానికి ఎంతో ఉపయోగపడింది. ఈ రోజు మరోసారి ఆయన నా సినిమా ట్రైలర్‌కు రావడం ఆనందంగా ఉంది. ఆయనకు నా కృతజ్ఞతలు.' అన్నారు. 
 
మారుతి మాట్లాడుతూ '' ఈ సినిమాకు టైటిల్‌తోనే విజయం సాధించారు. మంచి టైటిల్‌ పెట్టారు. సినిమా కూడా బాగుంటుందనే ఫీల్‌ కలుగుతుంది. మంచి టైటిల్‌ ఈ సినిమాకు పెట్టడంతో మంచి పాజిటివ్‌ వైబ్‌ ఉంది. చాలా రోజుల నుంచి ప్రవీణ్‌ను హీరోగా చూడాలనుకుంటున్నాను. ఈ రోజుకు కుదిరింది. డెఫినెట్‌గా ఈ సినిమా ప్రవీణ్‌ కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్‌ అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించి ఈ సినిమా యూనిట్‌ అందరికి మంచి పేరు తీసుకరావాలని అని కోరుకుంటున్నాను' అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments