Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ని రంగాల్లో సక్సె స్ కావాల‌నేదే నా ప్రయత్నం : నిర్మాత, నటుడు సురేష్ కొండేటి

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (11:27 IST)
Suresh-chiru
మన జీవితానికి ఓ లక్ష్యం అంటూ ఉండాలి, దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం ఉండాలి. అలాంటి ప్రయత్నం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు సురేష్ కొండేటి. తెలుగు సినిమా పరిశ్రమలో సురేష్ కొండేటి అంటే తలలో నాలుకలా ఉంటాడన్న పేరు ఉంది. సాధారణ స్థాయి నుండి ఓ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మ్యాగజిన్ అధినేత, నటుడు ఇలా పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. ఈ మద్యే దేవినేని సినిమాలో సెకండ్ లీడ్ పాత్రలో నటించి మెప్పించిన సురేష్ కొండేది జన్మదిన అక్టోబర్ 6, ఈ సందర్బంగా అయన మీడియాతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా సురేష్ కొండేటి మాట్లాడారు.
 
`మగధీర` సినిమా సక్సెస్ మీట్ లో ఇక్కడే ఫిలిం కల్చరల్ సెంటర్ లో మొదటి సారి ఆ వేదికపై నా బర్త్ డే వేడుకలను నిర్మాత అల్లు అరవింద్ గారు చేశారు. అప్పుడే నేను కూడా సెలెబ్రిటీ అయ్యానని అనుకున్నాను. ఆ ఉత్సహంతో మరింత ముందుకు సాగాను. నిజానికి నేను పరిశ్రమకు వచ్చింది నటుడిగా ఎదగాలని, 1992 లో నేను ఇండస్ట్రీ కి వచ్చాను. అప్పుడు చాలా సన్నగా ఉండేవాణ్ణి, కానీ నటుడికి కావలసిన క్వాలిటీస్ లేవని ఆ తరువాత తెలుసుకున్నానని` సురేష్ కొండేటి తెలియ‌జేస్తున్నారు. ఇప్ప‌టికి 30 ఏల్ళ అయింది. 
 
- అల్లు అర‌వింద్‌, దాస‌రినారాయ‌ణ‌రావు, చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్ వంటి ఎంద‌రో త‌న‌కు అండ‌గా నిలిచార‌ని తెలియ‌జేశారు. త‌న తండ్రి బేంక్ ఉద్యోగి అని. పాల‌కొల్లు నుంచి న‌టుడిని కావాల‌ని వచ్చాను. కానీ మొద‌ట్లో స‌క్సెస్ కాలేక‌పోయాను. అందుకే కృష్ణ ప్ర‌తిక‌లో చేరాను. `కృష్ణ చిత్ర` అనే ఓ స్పెషల్ మగజైన్ ముద్రించాం. నేను చిన్న‌త‌నంలోనే కృష్ణ‌గారి అభిమానిని. ఆ తరువాత టెన్త్ లో చిరంజీవి గారి అభిమానిగా మారిపోయా. కృష్ణ చిత్ర‌ బుక్ కోసం సింగపూర్ లో ఉన్న చిరంజీవి గారితో ఫోన్ లో మాట్లాడితే ఆయ‌న‌ ఫ్యాక్స్ లో పంపించారు . ఆ లెటర్ చూసిన వాళ్ళు ఆ పత్రికలో నన్నో సెలేబ్రిటిగా ట్రీట్ చేసారు. పరిశ్రమలో నాకు చాలా ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఎవరి సురేష్ అనే రేంజ్ లో ఎదిగాను. ఆ తరువాత వార్త పత్రికలో చేరాను. అక్కడ చేరాకా పరిశ్రమతో ఎక్కువగా అనుభందం పెరిగింది. 
 
- ఆ తరువాత మహేశ్వరీ ఫిలిమ్స్ అని డిస్ట్రిబ్యూషన్ వెస్ట్ గోదావరి జిల్లాలో  మొదలెట్టాను. తరువాత ఎస్ కె పిక్చర్ పేరుతొ డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ చేశా, స్టూడెంట్ నంబర్ 1 తో మొదలెట్టి చాలా సినిమాలు చేశాను. నేనుచేసిన సినిమాలని నాకు లాభాలను తెచ్చిపెట్టాయి. ఆ త‌ర్వాత సంతోషం మేగ‌జైన్, యూట్యూబ్ ఛాన‌ల్‌ను పెట్టి ఎంద‌రికో ప‌నిక‌ల్పించేలా ఎదిగాను అంటూ తెలిపారు.
 
suresh-dasari
- 75 చిత్రాలను పంపిణీచేసిన అనుభవం సురేష్ కొండేటిది. ఆ అనుభవంతోనే ‘ప్రేమిస్తే’ చిత్రంతో నిర్మాతగా మారారు. తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 'జర్నీ' 'పిజ్జా' ఇలా  దాదాపు పదిహేను చిత్రలను తెలుగువారి ముందుకు తీసుకొచ్చారు.  స్టార్ కమెడియన్ 'షకలక' శంకర్ హీరోగా ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో రూపుదిద్దుకున్న విజయవంతమైన చిత్రం 'శంభో శంకర' నిర్మాతల్లో సురేష్ కొండేటి ఒకరు. అలాగే మలయాళ చిత్రం 'ఉస్తాద్ హోటల్‌'ను తెలుగులో 'జనతా హోటల్‌' పేరుతో సురేష్ కొండేటి విడుదల చేశారు. వినోదంతో పాటు సామాజికాంశాలతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు సురేష్ కొండేటి ఉత్తమాభిరుచిని తెలియచేసేవే. నటుడిగానూ పయనం సాగిస్తున్నారు. 
 
20వ సంతోషం అవార్డ్స్‌కు సమాయత్తం
 
దక్షిణాది సినీ పరిశ్రమలో సంతోషం అవార్డ్స్ అంటే ఎంతో గౌరవం ఉంది. గత ఏడాది కరోనా వల్ల ఆగిన ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు సురేష్ కొండేటి సమాయత్తం అవుతున్నారు. ఈ సారి సుమన్ టీవీతో కలిసి సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లనూ సురేష్ కొండేటి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సంతోషం 20వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సంతోషం అవార్డ్స్ కార్యక్రమం నవంబర్ 14న హెచ్‌ఐసీసీలోని నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరగనుంది.
 
సేవా కార్య‌క్ర‌మం
- నేను వందరూపాయలు తీసుకుని హైద్రాబాద్ వచ్చాను. నేను నా సొంతంగా బతకాలన్నది నా ఆలోచన, ఇప్పుడు కూడా `మా` పిఆర్ ఓ గా ఏడాదికి ఇచ్చే అమౌంట్ కూడా ఎవరో కాస్థల్లో ఉన్న వారికీ సాయంగా ఇచ్చేసాను. మా నుండి ఒక్క రూపాయికూడా నేను తీసుకోలేదు. ప్రతి ఏడాది పేద కళాకారులకు ఒక్కొక్కరికి ఇరవై, ఇరవై ఐదు,  పదిహేను వేల చొప్పున సంతోషం అవార్డు వేడుకలో ఇస్తూ వచ్చాను, ఈ పాండమిక్ సమయంలో తప్ప. ఏది ఏమైనా ఈ రోజు పరిశ్రమలో నాకంటూ ఓ మంచి గుర్తింపు ఇచ్చిన సినిమా కళామతల్లి కోసం కష్టపడడానికి రెడీగా ఉన్నాను. ఇక నటుడిగా మంచి పాత్రలు చేయాలని, దాంతో పాటు దర్శకత్వం కూడా చేయాలనీ ఉంది అంటూ ముగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమల ఆలయ ప్రవేశం... రోజుకు 80వేల మంది మాత్రమే..

పురచ్చి తలైవర్ ఎంజీఆర్ అంటే నాకు ప్రేమ, అభిమానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. తమిళనాడు నుంచి రాలేదు..

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments