Webdunia - Bharat's app for daily news and videos

Install App

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

దేవీ
సోమవారం, 31 మార్చి 2025 (16:18 IST)
On Kushal Raj and prudhvi.. clap by VV vinayak
ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్. 1గా కుశాల్ రాజును హీరోగా పరిచయం చేస్తూ స్కైఫై డ్రామాను తెరకెక్కించబోతున్నారు. డా. లతా రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, మల్లిడి వశిష్ట, ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు నిర్మాతలు అచ్చిరెడ్డి, బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి స్క్రిప్ట్‌ను అందజేయగా, వీవీ వినాయక్ ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టారు. మల్లిడి వశిష్ట ఫస్ట్ షాట్ డైరెక్టర్ చేశారు. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 
 
దర్శకుడు మల్లిడి కృష్ణ మాట్లాడుతూ..‘‘2012లో నా జర్నీ మొదలైంది. ఎన్నోమలుపులు తిరిగి మీ ముందుకు డైరెక్టర్‌గా వచ్చాను. లత గారి  నిర్మాత దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఇదొక స్కైఫై డ్రామా మూవీ. ఓటీటీల యుగంలో ఇలాంటి కథను ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలి. రాబోయే ఈవెంట్స్‌లో మరిన్ని వివరాలు వెల్లడిస్తా.’’ అని చెప్పారు.
 
సీనియర్ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ..‘‘పెళ్లి సినిమా తర్వాత నేను చేసిన కొన్ని సినిమాలకు ఇలాంటి భారీ ఓపెనింగ్స్ జరిగాయి. మళ్లీ ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో గ్రాండ్ ఓపెనింగ్ జరగడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసమే నా హెయిర్ స్టైల్ మార్చాను. ఇందులో నాది పాజిటివ్ క్యారెక్టర్. డైరెక్టర్ వచ్చి కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. యానిమల్ మూవీ తర్వాత నా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం నేను 19 సినిమాలు చేస్తున్నా. అందులో ఇది ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ కృష్ణ వెరీ టాలెంటెడ్ పర్సన్. మొన్న జరిగిన ఫొటో షూట్‌తో నాకు ఆ విషయం అర్థమైంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది.’’ అని చెప్పారు.
 
హీరో కుశాల్ రాజు మాట్లాడుతూ..‘‘నా దర్శకుడు కృష్ణకు నేను థ్యాంక్స్ చెప్పాలి. నన్ను హీరోగా పరిచయం చేయడం కోసం మా అమ్మ లతగారు చాలా కేర్ తీసుకున్నారు. వీవీ వినాయక్ గారికి, బెల్లంకొండ శ్రీనివాస్ గారికి, మా టీమ్ మొత్తానికి బిగ్ థ్యాంక్స్.’’ అని అన్నారు.
 
నిర్మాత డాక్టర్ లతారాజు మాట్లాడుతూ..‘‘నిర్మాతగా నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. మా అబ్బాయి కోరిక మేరకు నేను నిర్మాత అవ్వాల్సి వచ్చింది. డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. పృథ్వీ గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. కామెడీ, లవ్ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. ప్రేక్షకులు సినిమాలో లీనమయ్యేలా ఉంటుంది. బాబీ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్‌లా నిలబడ్డాడు. పృథ్వీగారు మా బాబును ఎంతగానో గైడ్ చేస్తున్నారు. మా టీమ్ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. కార్యక్రమానికి వచ్చిన గెస్ట్‌లు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని చెప్పారు.
 
ఫైట్ మాస్టర్ జీవన్ మాట్లాడుతూ.. ‘‘ఈ స్టోరీ ఎంత బాగుంటుందనే విషయం మాటల్లో చెప్పలేము. విన్నప్పుడు నేనే షాక్ అయ్యా.. అంత బాగుంటుంది. హీరోగారు స్టోరీలోకి బాగా ఇన్వాల్వ్ అయిపోయి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకుని ఎంతో కష్టపడుతున్నారు. ఆర్టిస్టులందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని చెప్పారు.
తారాగణం: కుశాల్ రాజు(హీరో), జగపతి బాబు, పృథ్వీరాజ్, వైవా హర్ష, బబ్లూ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments