లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

దేవీ
సోమవారం, 31 మార్చి 2025 (15:52 IST)
Laggam time team
రాజేష్ మేరు, నవ్య చిత్యాల హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం  'లగ్గం టైమ్'.  ఈ సినిమాలో నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి పవన్ గుంటుకు సినిమాటోగ్రాఫర్‌. ఇక పవన్ సంగీతంలో రూపుదిద్దుకున్న పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.  'ఏమైందో గాని' పాట అయితే చార్ట్ బస్టర్ గా నిలిచింది. '20th సెంచరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌' నిర్మాణంలో కె.హిమ బిందు నిర్మిస్తున్న రామ్ కామ్ ఎంటర్టైనర్ ఇది.
 
ఇక ‘లగ్గం టైమ్‌’ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను 'భీమ్లా నాయక్' దర్శకుడు సాగర్ కె చంద్ర ఆవిష్కరించగా దానికి కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇక తాజాగా షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా నిర్వహిస్తున్నారు. 'లగ్గం టైమ్' లో యూత్ ను మాత్రమే కాదు టైటిల్ కి తగ్గట్టు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉందని.. సినిమా చాలా బాగా వచ్చిందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నారు. అంతేకాదు సమ్మర్ కానుకగా 'లగ్గం టైమ్' ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని కూడా టీం వెల్లడించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేవుడుకి విశ్రాంతి లేకుండా చేస్తారా? సుప్రీంకోర్టు అసహనం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వగృహంలో మహాపడి పూజ (video)

Nitish Kumar, ముస్లిం మహిళ హిజాబ్‌ను ముఖం నుంచి లాగి వివాదంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ (video)

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ.. గోదావరి జిల్లాల్లో కోడి పందేల కోసం అంతా సిద్ధం

నల్లగా ఉందని భర్త... అశుభాలు జరుగుతున్నాయని అత్తామామలు.. ఇంటి నుంచి గెంటేశారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments