Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

Advertiesment
anand mahindra

ఠాగూర్

, సోమవారం, 31 మార్చి 2025 (12:38 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు ఆలోచనలు అద్భుతమంటూ కొనియాడారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. అరకు కేఫ్ విస్తరిస్తున్న తీరును చూసి ఆయన సంతోషిస్తారని పేర్కొన్నారు. 
 
పారిస్ కేఫ్‌ల్లోని ఎలక్ట్రానిక్ స్క్రీన్‌లపై అరకులోని గిరిజనలు జీవనశైలికి సంబంధించిన చిత్రాలు, వీడియోలను ప్రదర్శించనున్నట్టు తెలిపారు. ఇక్కడి కాఫీ ప్యాకేజింగ్‌ని గిరిజనుల వేషధారణ, భారతదేశంలోని వైవిధ్యమైన రంగుల స్ఫూర్తితో రూపొందించినట్టు వివరించారు. 
 
మరోవైపు, ఈ నెల 29వ తేదీన కూడా ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసిన విషయం తెల్సిందే. పారిస్‌లో మా రెండో అరకు కాఫీ స్టాల్ అంటూ వీడియో పెట్టారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. పచ్చని అరకులోయ నుంచి పారిస్ నడిబొడ్డుకు మేడ్ ఇన్ ఏపీ ఉత్పత్తి చేయడం ప్రపంచ వ్యప్తంగా తగిన గుర్తింపు లభించడం స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసిడి ప్రియులకు శుభవార్త : హైదరాబాద్‌లో బంగారం ధర ఎంత?