Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్ జీవితం ఎన్నో బోధిస్తుంది : పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (18:49 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ జీవితం మనకు ఎన్నో బోధిస్తుందని, జీవితంలో ఎదుగుతున్న క్ర‌మంలో ఎదుర‌య్యే అస‌మాన‌త‌ల‌ని ఎలా పోరాడాలి అనేది ఆయ‌న జీవితం నేర్పిస్తుంది అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. 
 
టాలీవుడ్ సూపర్ స్టార్ (మెగాస్టార్) చిరంజీవి నటించిన 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి" విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అమితాబ్ రాజ‌గురువు పాత్ర‌ను పోషించారు. 
 
రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బేన‌ర్‌పై మూవీ నిర్మిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అమితాబ్ టీంతో క‌లిసి షూటింగ్‌లో పాల్గొన్నారు. అదేస‌మయంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైరా సెట్‌కి వెళ్ళారు. త‌న అభిమాన న‌టుడు.. అన్న‌య్య సినిమాలో న‌టిస్తున్నార‌ని తెలిసి, బిగ్ బీని క‌లిసేందుకు అక్క‌డికి వెళ్లారు ప‌వ‌న్‌. 
 
కొద్ది సేపు అమితాబ్ తో ముచ్చ‌టించిన త‌ర్వాత చిరు, అమితాబ్, చెర్రీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి ఫోటో దిగారు. ఆ ఫోటో అప్ప‌ట్లో వైర‌ల్ కాగా, ప‌వ‌న్ తాజాగా మ‌రోసారి ఆ ఫోటోల‌ని త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా షేర్ చేశాడు. 
 
'నా జీవితంలో ఆ క్ష‌ణం ఎంతో అపురూపం. నా గురువు, గౌరవప్రదమైన "శ్రీ అమితాబ్ బచ్చన్ జీ"ని సైరా సెట్స్‌లో కలిసాను. అతని జీవితం మనకు ఎన్నో బోధిస్తుంది. జీవితంలో ఎదుగుతున్న క్ర‌మంలో ఎదుర‌య్యే అస‌మాన‌త‌ల‌ని ఎలా పోరాడాలి అనేది ఆయ‌న జీవితం నేర్పిస్తుంది' అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓరి నాయనో అదానీపై కేసుకు ఆంధ్రప్రదేశ్‌కు లింక్... భారీగా ముడుపులిచ్చారట!

స్టీల్ ప్లాంట్ భూములు అమ్మాలని సలహా ఇచ్చింది జగనే.. పవన్ (video)

పెంపుడు జంతువుల పట్ల సంపన్నుల పీనాసితనం.. విరక్తితో వెటర్నరీ డాక్టర్...

బాలికపై అఘాయిత్యం : పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు... చంపేసిన ప్రియుడు..

కేటీఆర్ చేసిన కుట్రలకు ఆయన జైలుకు వెళ్లనున్నారు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments