Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంలో పవన్ కళ్యాణ్..?

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (17:28 IST)
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి కాంట్రవర్సీతో ముందుకొచ్చాడు. సరిగ్గా ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించి ప్రకంపనలు రేపిన వర్మ తాజాగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ మరో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమైపోయాడు. ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌‌ని ఇటీవలే రిలీజ్ చేసిన వర్మ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చారు. 
 
‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాలో ఈయన ఎవరి క్యారెక్టర్ చేస్తున్నారో గెస్ చేయండి అంటూ పవన్ పోలికలతో ఉన్న నటుడి ఫోటో ట్వీట్ చేసి పెద్ద చర్చకు దారి తీసాడు. సరిగ్గా పవన్ కళ్యాణ్‌ను పోలిన మనిషి ఫోటోను ట్వీట్ చేసి పెద్ద వివాదానికి తెరలేపాడు. ఈ ఫోటోను కాస్తంత దూరం నుంచి చూసిన వారు ఎవరైనా అది పవన్ కళ్యాణ్ అనుకుంటారు. 
 
అయితే దగ్గరగా చూస్తే కానీ అది పవన్ కళ్యాణ్ కాదు అనే విషయం అర్థమవుతుంది. సాధారణంగా సినిమా టైటిల్‌తోనే కావాల్సిన పబ్లిసిటీ రాబట్టడంలో వర్మ దిట్ట. సినిమా ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉన్న సందర్భాలు కోకొల్లలు. తాజాగా వర్మ ట్వీట్‌లో పవన్ పోలిన వ్యక్తి ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments