కాబోయే వధూవరులకు ముందుగానే దండలు మార్పించిన మోహన్ బాబు

డీవీ
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (11:28 IST)
Mohan Babu garlands bride and groom, Ashish, Advaita
తెలుగు సినిమా రంగంలో మంచు మోహన్ బాబు ది విలక్షణమైన శైలి. సాయిబాబా, వెంకటేశ్వర స్వామి భక్తుడైన ఆయన నిత్యం పూజగదిలో గంటసేపుపైగా వుంటారు. సరిగ్గా అటువంటి సమయంలో దిల్ రాజు కుటుంబీకులు మోహన్ బాబు ఇంటికి వెళ్ళారు. దిల్ రాజు తమ్ముడు లక్మణ్ కొడుకు ఆశిష్, అద్వైత రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా వివాహానికి హాజరు కావాలని పలువురు సినీ పెద్దలు, ముఖ్యమంత్రిని, రాజకీయ నాయకులను దిల్ రాజు కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
 
Dil raju family with mohanbabu
ఈరోజు మోహన్ బాబు ఇంటికి వెళ్ళి స్వయంగా బిడ్డలపై ఆశీస్సలు కోరారు. ఆహ్వాన పత్రిక అందుకున్న మోహన్ బాబు, వారి వివాహ సమయానికి తాను ఇండియాలో ఉండబోవడంలేదని, మంచు విష్ణు సినిమా కన్నప్ప షూటింగ్ నిమిత్తం న్యూజిలాండ్ లో వుంటానని చెప్పారు. ఆ వెంటనే నూతన వధూవరులకు తన పూజా మందిరం వద్ద దండలు మార్పించి తన ఆశీస్సులు అందించారు మోహన్ బాబు. దానితో దిల్ రాజు కుటుంబీకలు సంతోషించి క్లాప్స్ కొట్టారు. కాగా, ఫిబ్రవరి 14న ఆశిష్, అద్వైత ల వివాహం జైపూర్ లో గ్రాండ్ గా జరుగనున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

ఇన్‌స్టాగ్రాంలో ఎవడితో చాటింగ్ చేస్తున్నావ్, భర్త టార్చర్: వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments