Webdunia - Bharat's app for daily news and videos

Install App

బట్టల రామస్వామిని అభినందించిన మోహన్‌బాబు

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (16:07 IST)
Narayan-Mohanbabu
అల్తాఫ్‌ హసన్‌ హీరోగా, శాంతిరావు, లావణ్యారెడ్డి, సాత్వికాజేలు హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్‌’.సెవెన్‌హిల్స్‌ సతీశ్, రామ్‌ వీరపనేని నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రామ్‌ నారాయణ్‌ తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే రూపొందించారు. ‘బట్టల రామస్వామి బయోపిక్‌’ ఇటీవలే జీ5 ఓటిటి చానల్‌లో విడుదలై చక్కని విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ‘బట్టల రామస్వామి’ చిత్రాన్ని చూసిన అనేకమంది సెలబ్రిటీలు, విమర్శకులు సినిమా టీమ్‌ను అభినందించటం విశేషం. 
 
ఇదంతా ఒకెత్తయితే మంచు మోహన్‌బాబు సినిమాను చూసి దర్శకుడు రామ్‌ నారాయణ్‌ను పిలిపించుకుని అభినందించటం విశేషం. తనకు సినిమా ఎంతగానో నచ్చిందంటూ సినిమా షూటింగ్‌ విశేషాలను, ఎన్ని రోజుల్లో సినిమాను తెరకెక్కించారు, ఎక్కడెక్కడ చిత్రీకరణ చేశారు అని అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారట. 
 
ఈ సందర్భంగా దర్శకుడు రామ్‌ నారాయణ్‌ మాట్లాడుతూ, నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. కరోనా సమయం అయినప్పటికీ సినిమా నచ్చటంతో నిన్ను వ్యక్తిగతంగా అభినందించాలి అని పిలిపించాను అన్నారు. మోహన్‌బాబు గారి వంటి లెజెండ్‌ మా సినిమాను చూసి అభినందనలు చెప్పటం అది ఆయన గొప్పతనం. సినిమా చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు నాకు ఫోన్‌ చేసి మెచ్చుకున్నారు. కానీ, మోహన్‌బాబు గారు ‘‘సన్నాఫ్‌ ఇండియా’’ సినిమా రిలీజ్‌ హడావిడిలో ఉండి కూడా  నన్ను పిలిపించి మాట్లాడటంతో ఇది మా సినిమాకు దక్కిన గొప్ప విజయంగా నేను భావిస్తున్నా’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments