Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌లో హీరో నాని "ఎంసీఏ" ఫుల్‌మూవీ

నాని హీరోగా నటించి గత గురువారం విడుదలైన చిత్రం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి). సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, భూమిక కీలకమైన పాత్రను పోషించింది.

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (18:11 IST)
నాని హీరోగా నటించి గత గురువారం విడుదలైన చిత్రం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి). సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, భూమిక కీలకమైన పాత్రను పోషించింది. నాని.. సాయిపల్లవికి గల క్రేజ్ కారణంగా ఈ సినిమా, తొలి రోజున భారీ ఓపెనింగ్స్‌ను సాధించింది. 
 
అయితే, ఈ చిత్రం విడుదలైన రాత్రికే ఫేస్‌బుక్‌లో ఫుల్ మూవీ దర్శనమిచ్చింది. ఈ సినిమాను సాయి చరణ్ అనే వ్యక్తి ఫేస్‌‌బుక్‌లో పెట్టాడు. సినిమాను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయటంతో కలెక్షన్లపై భారీ ప్రభావం పడుతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. దీంతో ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే, సినిమా రిలీజ్‌కు ముందే పైరసీ జరిగిందంటూ వార్తలు రావటంతో నిర్మాత దిల్ రాజు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
మరోవైపు, ఈ చిత్రం కలెక్షన్లపరంగా దుమ్మురేపుతోంది. తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ.11 కోట్లను రాబట్టిన ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా రూ.15 కోట్లకి పైగా వసూలు చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లోనూ ఈ సినిమా వసూళ్లు పెరుగుతూ పోతుండటం విశేషం. ఆస్ట్రేలియా బాక్సాఫీస్ చార్టులో ఈ సినిమా 12వ స్థానంలో నిలిచిందని చిత్ర యూనిట్ చెపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఫ్యామిలీ మాస్ సూసైడ్..

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం భూసేకరణ- కేంద్రం నిధుల విడుదలలో జాప్యం

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments