Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిజంగానే డార్లింగ్.. నన్ను బుట్టలో పడేశాడు : శ్రద్ధా కపూర్

బాలీవుడ్ చిత్రపరిశ్రమలో మోస్ట్ సక్సెస్‌ఫుల్, యంగ్ టాలెంటెడ్ హీరోయిన్స్‌లో శ్రద్ధా కపూర్ ఒకరు. ఈ అమ్మడు అందాలు ఆరబోయటమేకాకుండా, తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ అమ్మడు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి

Advertiesment
Shraddha Kapoor
, శుక్రవారం, 22 డిశెంబరు 2017 (11:36 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో మోస్ట్ సక్సెస్‌ఫుల్, యంగ్ టాలెంటెడ్ హీరోయిన్స్‌లో శ్రద్ధా కపూర్ ఒకరు. ఈ అమ్మడు అందాలు ఆరబోయటమేకాకుండా, తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ అమ్మడు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
 
'బాహుబలి' ప్రభాస్ నటించే కొత్త చిత్రం "సాహో"లో ఈ భామ హీరోయిన్‌గా కనిపించనుంది. వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా, రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో హైటెక్నికల్ వ్యాల్యూస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా శ్రద్ధా నెటిజన్స్‌తో ట్వీట్ చర్చ జరిపింది. ఇందులో కొందరు సినీ లవర్స్ ప్రభాస్, మహేష్ బాబు, రజనీకాంత్ వంటి సౌత్ స్టార్స్‌పై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించారు. వీటికి శ్రద్ధా కపూర్ విసుగు చెందకుండా సమాధానం చెప్పింది. 
 
'బాహుబలి' ప్రభాస్ గురించి స్పందిస్తూ, ఖచ్చితంగా డార్లింగే. నేను ఇప్పటివరకు కలిసిన వారిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రభాస్. చాలా సింపుల్‌గా ఉండే ప్రభాస్, తన కామ్ గోయింగ్‌తో తనను కూడా బుట్టలో పడేశాడనీ శ్రద్ధా చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే, ఒక్క మాటలో మహేష్ బాబు గురించి చెప్పమంటే అతను ఫెంటాస్టిక్ అండ్ మైడ్ బ్లోయింగ్ అంది. ఇక రజనీకాంత్ చాలా సింప్లిసిటీ పర్సనే కాదు ఎందరికో ఇన్సిపిరేషన్ కూడా అని బాలీవుడ్ సుందరాంగి చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింహం మౌనంగా ఉంటే సన్యాసం తీసుకున్నట్టు కాదు : #JaiSimhaTeaser