Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎంతైనా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' కదా... అంతేలే!! రివ్యూ రిపోర్ట్

మిడిల్ క్లాస్ అబ్బాయి నటీనటులు: నాని, సాయిపల్లవి, భూమిక, రాజీవ్ కనకాల, సీనియర్ నరేష్, పోసాని, వెన్నెల కిషోర్, శుభలేక సుధాకర్ తదితరులు. సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు: రాజు, శిరీష్, లక్ష్మణ్, దర్శకత్వం: శ్రీరామ్ వేణు. సాయి పల్లవి, నాని అనగానే అంచ

ఎంతైనా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' కదా... అంతేలే!! రివ్యూ రిపోర్ట్
, గురువారం, 21 డిశెంబరు 2017 (18:18 IST)
మిడిల్ క్లాస్ అబ్బాయి నటీనటులు: నాని, సాయిపల్లవి, భూమిక, రాజీవ్ కనకాల, సీనియర్ నరేష్, పోసాని, వెన్నెల కిషోర్, శుభలేక సుధాకర్ తదితరులు. సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు: రాజు, శిరీష్, లక్ష్మణ్, దర్శకత్వం: శ్రీరామ్ వేణు.
 
సాయి పల్లవి, నాని అనగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఫిదా చిత్రంతో మంచి హిట్ కొట్టిన సాయి పల్లవి హీరోయిన్‌గా, వరుస హిట్లతో దూసుకుపోతున్న నాని హీరోగా వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా వున్నాడో చూద్దాం. 
 
ఓ మధ్యతరగతి కుటుంబం. అన్నయ్య, వదిన, బాబాయ్, పిన్ని... ఇలా వారిమధ్య వుండే అనుబంధాలు, ఆప్యాయతలు. ఒకరికోసం ఇంకొకరు త్యాగం చేసుకునే మనస్తత్వాలు. ఇలాంటి ఫార్ములాతో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయనుకోండి. ఇక ఈ చిత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది ఏమంటే, వదిని-మరిది మధ్య సన్నివేశాలు. రాజీవ్, నాని ఇద్దరు అన్నదమ్ములు. రాజీవ్ పెళ్లయ్యాక భార్యకు ప్రాముఖ్యతనిస్తూ తమ్ముడిని ప్రక్కన పెట్టేస్తాడు. దాంతో అక్కడ వుండలేక బాబాయ్ ఇంటికి వచ్చేస్తాడు నాని. ఇలావుండగా ఓ రోజు రాజీవ్ తమ్ముడికి ఫోన్ చేస్తాడు. నీ వదిన జ్యోతికి వరంగల్ బదిలీ అయ్యిందనీ, ఆమెతో పాటు వరంగల్ వెళ్లాలని కోరుతాడు. 
 
ఇష్టం లేకపోయినా అన్నకోసం వదిన వెంట వెళతాడు. ఇక అక్కడ ఇంటి పనులన్నిటనీ మరిదితో చేయిస్తుంటుంది జ్యోతి. వాటిని భరించలేని నాని ఇక బాబాయ్ ఇంటికి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతాడు. ఐతే దారిలో పల్లవి(సాయిపల్లవి)ని చూసి ఆగిపోతాడు. అలా చూస్తుండగానే ఆ అమ్మాయి నాని వద్దకు వచ్చి ఐ లవ్ యు అని చెప్తుంది. అంతే... ఊరు విషయం పక్కనెట్టేసి ఆమె కోసం వెతుకుతుంటాడు. ఐతే పల్లవి తన వదిన చెల్లెలని తర్వాత తెలుస్తుంది. 
 
ఇదిలావుండగా అక్కడ శివశక్తి ట్రావెల్స్ యజమాని శివ(విజయ్) నిబంధనలు పాటించకుండా అక్రమంగా బస్సులు తిప్పుతుంటాడు. అలా బస్సులు నడపడం వల్ల ప్రమాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోతారు. బస్సుల్ని తనిఖీ చేసిన జ్యోతి, రెండు బస్సుల్ని సీజ్ చేస్తుంది. దాంతో జ్యోతిని చంపుతానని శివ బెదిరిస్తాడు. అతడికి నాని దేహశుద్ధి చేస్తాడు. ఆ తర్వాత కూడా జ్యోతిని చంపేందుకు శివ ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో వదినకు ఎలాంటి హాని జరుగకుండా ఆమెను నీడలా వెన్నంటి వుంటాడు నాని. ఎంత కాపు కాసినా పది రోజుల్లో నీ వదినని చంపేస్తానని శివ వార్నింగ్ ఇస్తాడు. మరి ఆ 10 రోజుల్లో ఏం జరిగింది. నాని తన వదినను కాపాడుకున్నాడా అనేది మిగిలిన కథ.
 
పెర్ఫార్మెన్స్ పరంగా చూసినప్పుడు నాని క్యారెక్టర్ ఏమంత డిఫరెంటుగా అనిపించలేదు. ఈ చిత్రంలో కూడా నానిని గతంలో చూసినట్లే అనిపిస్తుంది. మిడిల్ క్లాస్ అబ్బాయిగా సరిపోయాడు. నాని పెర్ఫార్మెన్స్ బాగుంది. సాయి పల్లవి పాత్రను ఇంకొంచెం పవర్‍ఫుల్‌గా తీర్చిదిద్దినట్లయితే బాగుండేది. విజయ్‌తో విలన్ క్యారెక్టర్ ఏమాత్రం సెట్ కాలేదు. ఆర్.టి.ఓ ఆఫీసరుగా భూమిక గెటప్ బాగున్నప్పటికీ ఆమె నుంచి తగిన నటనను రాబట్టుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడని చెప్పక తప్పదు. మిగిలిన క్యారెక్టర్స్ ఫర్వాలేదు. ఇక చిత్రం విషయానికి వస్తే ఫస్టాఫ్ అంతా హీరో, హీరోయిన్ సన్నివేశాలు కాస్తంత ఫన్నీగా అనిపించాయి కానీ సెకండాఫ్‌లో మామూలుగా సాగాయి. మిడిల్ క్లాస్ గురించి వచ్చే డైలాగులకు ప్రేక్షకుల నుంచి స్పందన ఆశించిన స్పందన కనబడలేదు. నాని-సాయి పల్లవిలతో ఇలాంటి చిత్రం వస్తుందని ఎవరూ ఊహించి వుండకపోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాకినాడలో జూ.ఎన్టీఆర్ ఫ్యామిలీ సందడి (అరుదైన వీడియో)