Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వ్యక్తి నన్ను రేప్ చేయబోయాడు : బాంబు పేల్చిన హీరోయిన్ తల్లి

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (16:19 IST)
సినీ ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్లు మాత్రమే కాదు.. వారి తల్లులు కూడా లైంగిక వేధింపులకు గురైనట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తల్లి, సినీ నటి సోనీ రజ్దాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా అత్యాచారానికి గురైనట్టు తెలిపింది. గ‌తంలో త‌నకి ఎదురైన అనుభ‌వాల‌ని ఓ ఇంట‌ర్వ్యూలో వివ‌రిస్తూ అంద‌రిని షాక్‌కి గురిచేసింది. 
 
మీటూ ఉద్యమంలో భాగంగా, ప్ర‌స్తుతం ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మకి ఎదురైన లైంగిక వేధింపుల గురించి బాహ‌టంగా చెబుతున్నారు. త‌ను శ్రీ ద‌త్తా, సోనా మ‌హాపాత్ర‌, వింటా నందా, సంధ్యా మృదుల్ త‌దిత‌ర మ‌హిళ‌లు లైంగిక వేధింపుల‌కి సంబంధించిన విష‌యాల‌ని బ‌య‌ట‌పెట్ట‌గా, తాజాగా అలియా త‌ల్లి సోనీ రజ్ధాన్ త‌న‌పై జ‌రిగిన లైంగిక దాడికి సంబంధించిన విష‌యాలు తెలియ‌జేసింది.
 
ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన‌ప్పుడు నాకు లైంగిక వేధింపులు ఎదురుకాక‌పోవ‌డం చాలా అదృష్టంగా ఫీలవుతాను. కానీ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఓ వ్య‌క్తి నాపై అత్యాచార ప్ర‌య‌త్నం జ‌ర‌ప‌డం తనను భ‌య‌బ్రాంతుల‌కి గురిచేసిందని చెప్పారు. అదృష్టం బాగుండ‌డంతో ఆ వ్య‌క్తి నుండి తప్పించుకున్నట్టు తెలిపారు. 
 
అయితే, అతని పేరును మాత్రం ఇపుడు బయటపెట్టలేనని, అలా చేస్తే అత‌ని కుటుంబానికి బాధ మిగ‌ల్చాల‌నుకోవ‌డం లేదు. అత‌నికి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారని చెప్పుకొచ్చింది. ఆ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్ప‌టి నుంచి అత‌నితో మాట్లాడ‌మే మానేశాను. త‌ప్పు చేసిన వాడు ఎప్ప‌టికైన శిక్ష అనుభ‌విస్తాడని తెలిపింది. 
 
అదేసమయంలో మీటూలో భాగంగా బాధిత మ‌హిళ‌లు బ‌య‌ట‌కి వ‌చ్చి లైంగిక వేధింపుల గురించి చెప్ప‌డం గొప్ప విష‌యం. కానీ అంద‌రు చెప్పుకోలేరు. వారిని ఎందుకు చెప్ప‌లేదు అని ప్ర‌శ్నించి ఇబ్బంది పెట్ట‌కూడడు అని సోనీ ర‌జ్ధాన్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం