Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా మేనల్లుడి మరో ప్రాజెక్ట్... కథ విన్న చిరంజీవి ఏమన్నారంటే..?

Webdunia
బుధవారం, 29 మే 2019 (18:44 IST)
మెగా కాంపౌండ్‌లోని హీరోలలో చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మొదట్లో మంచి హిట్‌లు అందుకున్నప్పటికీ, కొద్దికాలంగా వరుస పరాజయాలను చవిచూస్తున్నారు. కెరీర్ సెట్ అవుతుందనే దశలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక లాభం లేదనుకున్న చిరంజీవి అల్లుడి కోసం రంగంలోకి దిగారట. అరడజను పైగా సినిమాల ఫ్లాపుల బరువు మోస్తున్న తేజు ఇటీవల నటించి విడుదలైన చిత్రలహరి కాస్త ఫరవాలేదనిపించింది. 
 
ఈ తరుణంలో సినిమాల ఎంపిక విషయంలో సరైన మార్గనిర్దేశం లేకపోవడం వల్లనే వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఇకనైనా ప్రాజెక్టుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్న సాయిధరమ్ తేజ్ కథలను ఎంపిక చేసుకునే విషయంలో మామ చిరంజీవి సాయం కోరారట. దీంతో రంగంలోకి దిగిన చిరంజీవి డైరెక్టర్ మారుతి చెప్పిన కథ విని ఓకే చెప్పారని సమాచారం.
 
సాయి ధరమ్ తేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మారుతి సిద్ధం చేసిన కథను చిరంజీవి, అల్లు అరవింద్‌లకు వినిపించగా, కథ బాగా నచ్చడంతో ఈ ఇద్దరూ పచ్చజెండా ఊపారని సమాచారం. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్లపై ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్, హీరోయిన్‌గా మాళవిక శర్మను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 
 
ఈ అందాలభామ ఇప్పటికే రవితేజ హీరోగా నటించిన నేల టిక్కెట్టు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటికీ ఆ తర్వాత సరైన అవకాశాలు లేక సోషల్ మీడియాపై దృష్టి పెట్టి ఈ ఛాన్స్ సాధించింది. మరి వీరిద్దరికీ ఈ సినిమా ఎలాంటి అనుభూతి మిగులుస్తుందో చూడాలి మరి.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments