Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌వితేజ‌కు హ్యాండ్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

Webdunia
శనివారం, 16 జులై 2022 (16:42 IST)
Ravi Teja with mega hand
ఎన‌ర్జిటిక్ హీరో మాస్ మహారాజ రవితేజకు మెగాస్టార్ చిరంజీవి హ్యాండ్ ఇచ్చారు. అదెలాగంటే, ఈరోజు హైద‌రాబాద్ శివార్లో మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా షూట్ జ‌రుగుతోంది. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అక్క‌డికి శ‌నివారం నాడు లంచ్ గేప్‌లో న‌ల్ల‌టికారులో ర‌వితేజ వ‌చ్చారు. మెగాస్టార్ చిరంజీవి కార్‌వాన్‌ను ద‌గ్గ‌ర‌గా వ‌చిన ర‌వితేజ కార్‌వాన్ డోర్ కొడుతూ, హ‌య్‌.. అన్న‌య్యా.. అంటూ ఆప్యాయ ప‌లుక‌రింపుతో.. హాయ్ బ్ర‌ద‌ర్ వెల్‌క‌మ్‌.. అంటూ క‌ల‌ర్‌ఫుల్ చొక్కా వేసుకున్న ఓ చేయి లోప‌లికి తీసుకెళ్ళుతుంది. ఆ వెనుకే వున్న ద‌ర్శ‌కుడు బాబీ.. మెగా మాస్ కాంబో బిగిన్స్ అంటూ.. కామెంట్ చేశాడు. ఈరోజు శుభ‌సూచ‌కంగా మెగాస్టార్‌, ర‌వితేజ క‌ల‌యిక జ‌రిగింది. చాలా కాలం త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్నారు. మాస్ మ‌హ‌రాజా జాయిన్ మెగా 154 అనే టైటిల్‌తో చిన్న వీడియో విడుద‌లైంది.
 
ఇదిలా వుండ‌గా, ర‌వితేజ న‌టిస్తున్న తాజా సినిమా `రామారావు ఆన్ డ్యూటీ`. ఈ చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఈరోజు ట్రైల‌ర్ విడుద‌ల కాబోతుంది. శ‌నివారం సాయంత్రం 7గంట‌ల త‌ర్వాత హైద‌రాబాద్‌లోని పార్క్ హోట‌ల్‌లో జ‌ర‌గున్ను ఈ వేడుక‌కు ర‌వితేజ‌, మెగాస్టార్‌ను ఇలా ఆహ్వానం ప‌లికారు. ఈ చిన్న‌వీడియో మెగా అభిమానుల్ని ఫిదా చేసింది.

సంబంధిత వార్తలు

మావోయిస్టులు అమర్చినట్లు బాంబు అలా పేలింది.. ఒకరు మృతి

తగ్గేద్యేలే... జూన్ 4 ఉదయం 10:30 గంటలకు వైసిపి సంబరాలు, 9న జగన్ సీఎం: సజ్జల సందేశం

వైద్యుడి ఇంట చోరీకి వచ్చి గుర్రుపెట్టి నిద్రపోయిన దొంగ...

ఏపీ ఎన్నికల కౌంటింగ్: పలనాడులో భారీ డ్రోన్‌ను దించిన బలగాలు (video)

ప్రపంచ రికార్డు: ఎన్నికల్లో పాల్గొన్న 64.2 కోట్ల మంది ఓటర్లు

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments