Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకోవాలంటూ ఆ హీరో వెంటబడ్డాడు... కానీ...

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (11:45 IST)
తెలుగువాడైన తమిళ హీరో విశాల్‌పై ఓ హీరోయిన్ సంచలన ఆరోపణలు చేసింది. గతంలో పెళ్లి చేసుకోవాలంటూ విశాల్ తన వెంటపడ్డాడని ఆ నటి చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు... మీరా మిథున్. అయితే, తనకు డబ్బున్నవారిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక విశాల్ ప్రతిపాదనను తోసిపుచ్చినట్టు చెప్పుకొచ్చింది. 
 
కాగా, ఈ మీరా మిథున్ గతంలో తమిళ హీరోలు విజయ్, సూర్యలపై వ్యక్తిగతంగా విమర్శలకు దిగి చేదు అనుభవాలను ఎదుర్కొంది. అయినప్పటికీ ఆమె తన పంథాను మార్చుకోలేదు. తాజాగా హీరో విశాల్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగింది. హీరో విశాల్ తనను వివాహం చేసుకోవాలని కోరుతూ మూడేళ్లు తిరిగాడని ఆమె తెలిపింది.
 
తన తల్లికి విశాల్ అంటే చాలా ఇష్టమని, అయితే, తనకు మాత్రం డబ్బున్న వాళ్లను వివాహమాడటం ఇష్టం లేదని, అందువల్లే తాను విశాల్ ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పుకొచ్చింది. మీరా మిథున్ వ్యాఖ్యల వీడియోను ఆమె మేనేజర్ సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు.
 
కాగా, ఇటీవల రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపైనా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తనపై మీరా చేసిన వ్యాఖ్యల గురించి విశాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి. కాగా, విశాల్‌లో హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో ప్రేమాయణం ఉన్న విషయం తెల్సిందే. ఒక సందర్భంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్లు కూడా వినిపించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానాశ్రయ చెత్తబుట్టలో శిశువు మృతదేహం!!

Hyderabad: వేడి నీళ్లతో నిండిన బకెట్‌లో పడి నాలుగేళ్ల బాలుడి మృతి

పారిశుద్ధ్యం కార్మికుల వేషంలో యూట్యూబర్ ఇల్లు ధ్వంసం... ఇంట్లో మలం వేశారు..

Rajini: ఎంపీ లావు కృష్ణ దేవ రాయలకు పూర్తి వడ్డీతో తిరిగి చెల్లిస్తాను.. రజనీ స్ట్రాంగ్ వార్నింగ్

వైకాపా హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్‌పై హోం మంత్రి అమిత్ షా ఆరా!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments