Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్లో పెళ్లి సందడి, ప్రభాస్ ఇప్పుడైనా పెళ్లి కబురు చెపుతాడా?

Webdunia
గురువారం, 14 మే 2020 (13:38 IST)
కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీలో సినిమా హాల్స్, సినిమా షూటింగ్‌లు ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్‌లు లేక కొత్త సినిమాలు విడుదల కాక.. సినీ ప్రియులకు డీలా పడుతుంటే... టాలీవుడ్లో పెళ్లి వార్తలు మాత్రం ఉత్సాహం కలిగిస్తున్నాయి.

ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు సెకండ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా దిల్ రాజు పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. అయితే.. ఆ వార్తలు నిజం కాదేమో గాసిప్ ఏమో అనుకున్నారు కానీ... ఇటీవల పెళ్లి చేసుకోవడంతో ఆ వార్త వాస్తవమే అని తెలిసింది.
 
యువ హీరో నిఖిల్ పెళ్లి ఈ రోజు జరిగింది. తను ప్రేమించిన పల్లవి వర్మను నిఖిల్ పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిఖిల్ పెళ్లి చేసుకున్నారు. ఇక మరో యువ హీరో నితిన్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్టుగా గత కొంత కాలంగా వార్తలు రావడం తెలిసిందే. త్వరలోనే నితిన్ కూడా పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. 
 
ఇటీవల దగ్గుబాటి రానా తన ప్రేమ, పెళ్లి గురించి బయటపెట్టి షాక్ ఇచ్చాడు. మిహీక బజాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా రానా ట్విట్టర్ ద్వారా ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. రానా డిసెంబర్లో పెళ్లి చేసుకోనున్నాడు. ఇక టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనేది గత కొంత కాలంగా సమాధానం లేని ప్రశ్నలా మారింది. అందరూ పెళ్లి కబురు చెబుతున్నారు. మరి.. ప్రభాస్ ఎప్పుడు చెబుతాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Man: సోదరుడిని కత్తితో పొడిచి చంపేసిన వ్యక్తికి జీవిత ఖైదు

అమెరికా: బోస్టన్ స్విమ్మింగ్ పూల్‌‌లో మునిగి వ్యక్తి మృతి

అయ్యో నా బిడ్డ పడిపోతున్నాడు, పిల్లవాడిని కాపాడేందుకు 13వ అంతస్తు నుంచి దూకేసిన తల్లి

Universal Health Policy: సార్వత్రిక ఆరోగ్య విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదముద్ర

Nara Lokesh: డీఎస్సీ 2025 నియామకాలు విజయవంతం.. నారా లోకేష్‌కు ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments