Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్క్ ఆంటోని సినిమా చాలా మంది వద్దన్నా చేశా.. కారణం ఏమంటే.. . హీరో విశాల్

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (16:04 IST)
Vishal, Ritu Varma, nitin, S. Vinod Kumar, Achich Ravichandran, S. J. Surya, Sunil
విశాల్  హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన చిత్రం‘మార్క్ ఆంటోని’. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్‌పై అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.వినోద్ కుమార్ నిర్మించారు. ఇక ఈ చిత్రంలో మరో పాపులర్ నటుడు ఎస్.జె.సూర్య కీ రీల్ పోషించారు. ఈ సినిమాలో విశాల్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా తెలుగు నటుడు సునీల్, తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం రాత్రి  ఘనంగా నిర్వహించారు.
 
 నితిన్ మాట్లాడుతూ..* ‘మార్క్ ఆంటోని ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అన్నీ క్రేజీగా ఉన్నాయి. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుంది. అధిక్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. సూర్య గారు నటుడిగా, దర్శకుడిగా నాకు చాలా ఇష్టం. అభినయ ఎంతో మందికి స్పూర్తి. ఆమె నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. సునీల్ అన్న ఎలాంటి పాత్రకైనా న్యాయం చేస్తుంటారు. విశాల్ నాకు మంచి స్నేహితుడు. ఆయన నటించే సినిమాలన్నీ హిట్ అవ్వాలని అనుకుంటాను. ఈ మూవీతో ఆయన మరో స్థాయికి వెళ్లాలి. సెప్టెంబర్ 15న రాబోతోన్న మార్క్ ఆంటోని పెద్ద హిట్ కాబోతోంది’ అని అన్నారు.
 
హీరో విశాల్ మాట్లాడుతూ. ‘నాకు ఈ స్టేట్‌లో  రానా, నితిన్‌లతోనే నేను ఎక్కువగా ఉంటాను. నితిన్ నాకు దొరకడం గిఫ్ట్. గెస్టుగా పిలిచా, కానీ నేను టైం ఇవ్వకపోయినా.. నాకోసం వచ్చాడు. నితిన్ సక్సెస్ గ్రాఫ్ చూస్తే నాకు ఆనందంగా ఉంటుంది. ఈ ఈవెంట్‌కు నితిన్ రావడం హ్యాపీగా ఉంది. ఈ రోజుతో నా మొదటి చిత్రం చల్లమే (తెలుగులో ప్రేమ చదరంగం) రిలీజై 19 ఏళ్లు అవుతోంది. ఆడియెన్స్ నా సినిమాలకు డబ్బులు పెట్టి, టికెట్ కొని చూస్తున్నారు. ఆ డబ్బుతో నేను, నా ఫ్యామిలీ మాత్రమే బాగుండాలని నేను అనుకోను. ఆ డబ్బులు అందరికీ ఉపయోగపడాలని అనుకుంటాను. నిర్మాత వినోద్ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. నా కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రం. 
 
మాకు పునాదిలా నిర్మాత నిలబడ్డారు. 9 ఏళ్ల క్రితం ఓ లవ్ స్టోరీని రాసుకున్నాడు. ఇది కథనా? అని నిర్మాత బయటకు వెళ్లమన్నాడు. నలబై మంది బయటకు గెంటేశారు. ఓ సినిమా తీశాడు. ఫ్లాప్ అయింది. ఏడేళ్లుగా మా ప్రయాణం సాగుతోంది. మా ప్రాజెక్ట్‌ను ప్రకటించిన తరువాత చాలా మంది వద్దు అన్నారు. నేను ఎందుకు చేశాను.. ఆ నమ్మకం ఏంటన్నది సెప్టెంబర్ 15న అందరికీ తెలుస్తుంది.  ఎస్ జే సూర్య 22 గంటలు కంటిన్యూగా డబ్బింగ్ చెబుతూనే ఉన్నారు. ఈ సినిమాతో నాకు సూర్య, సునిల్ రూపంలో మంచి బ్రదర్స్ దొరికారు. టీం అంతా కలిసి కష్టపడటం వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. అభినయ ఎంతో మందికి స్పూర్తి. ఆమెకు సరిహద్దులనేవి లేవు. వేణు గారు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. నన్ను నమ్మి ఈ సినిమాను తీసుకున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లందరికీ థాంక్స్. మార్క్ ఆంటోని అందరికీ నచ్చుతుంది. ఆడియెన్స్ పెట్టే డబ్బులకు న్యాయం జరుగుతుంది. రెండున్నర గంటలు నవ్వుకునేలా సినిమా ఉంటుంది’ అని అన్నారు.
 
అధిక్ రవిచంద్రన్ మాట్లాడుతూ, మార్క్ ఆంటోని విశాల్ కోసమే రాసిన కథ. విశాల్, ఎస్ జే సూర్య కాంబోలో వచ్చే సీన్లు అద్భుతంగా ఉంటాయి. ఇది తండ్రీ కొడుకుల కథ. విశాల్ అన్న కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. యాక్షన్ హీరో అనేది ఆయన పర్ఫామెన్స్‌ను డామినేట్ చేసింది. కానీ ఇందులో ఆయనలోని పరిపూర్ణమైన నటుడ్ని చూస్తారు. నాలాంటి వాళ్లని నమ్మి ఛాన్స్ ఇవ్వడం అంత సులభం కాదు. పుష్పలో సునిల్ గారి పాత్రను చూసి షాక్ అయ్యాను. ఇందులో పాత్రను చేస్తారా? అని అడిగాను. ఆయన ఫస్ట్ తమిళ్ సినిమా అద్భుతంగా ఉండబోతోంది. ఇందులో అందరూ అద్భుతంగా నటించారు. జీవీ సర్ అద్భుతంగా సంగీతం, ఆర్ఆర్ ఇచ్చారు. కెమెరామెన్ అభినందన్, నా టెక్నికల్ టీం అందరికీ థాంక్స్. మేం మా బెస్ట్ ఇచ్చాం. అందరూ మా సినిమాను చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 
సునిల్ మాట్లాడుతూ..* ‘నా లైఫ్‌లోనే తమిళ సినిమా చేస్తాను అని అనుకోలేదు. నాకు రెండో అవకాశం ఇచ్చాడు అధిక్. చిన్న పిల్లలకు భాష రాకపోతే, అక్షరాలు తెలియకపోతే ఎలా నేర్పించుకుంటామో అలా అధిక్ నన్ను చూసుకున్నాడు. ఆయన ఎప్పుడూ ఎనర్జీగానే ఉంటారు. ఎస్ జే సూర్య గారి దర్శకత్వంలో పని చేశాను. ఇప్పుడు ఆయన పక్కన నటించాను. నిర్మాత వినోద్ గారికి ఈ సినిమాతో బాగా డబ్బులు వస్తాయి. ఈ మూవీకి సీక్వెల్స్ తీస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. పందెం కోడిలో ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా విశాల్ అలానే ఉన్నారు. అభినయ పాన్ వరల్డ్ యాక్టర్. భాష అవసరం లేదు. మాట్లాడే అవసరం లేదు.. చార్లీ చాప్లిన్ కూడ మాట్లాడకుండా ప్రపంచం మొత్తం నవ్వించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడి మరణం- పోలవరం వెనుక అనేక కారణాలు.. వైఎస్ షర్మిల

ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనపై తెలుగు రాష్ట్రాలకు నో ఇంట్రెస్ట్

తెలంగాణలో కూడా జనసేన యాక్టివ్‌గా వుంటుంది.. పవన్ కళ్యాణ్

తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్ -భయాందోళనలో భక్తులు

ఏపీ ఎన్నికల ఫలితాలు.. రాజకీయాలు వద్దు.. హిమాలయాలకు జగన్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments