Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్క్ ఆంటోని గా విశాల్ సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు

Advertiesment
Vishal - Mark Antony
, మంగళవారం, 11 జులై 2023 (15:49 IST)
Vishal - Mark Antony
తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న హీరో విశాల్.. ఇప్పుడు 'మార్క్ ఆంటోనీ'గా మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో మన ముందుకు రాబోతున్నారు. సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ వినోద్ కుమార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం చివరి దశ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటిస్తూ, వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 15న చిత్రం విడుదల కానున్నట్లు, తాజా అఫిషియల్ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల  చేసారు మేకర్స్. 
 
ఇందులో మెయిన్ లీడ్స్ అందరూ సరికొత్త రెట్రో లుక్ తో కనిపించి సినిమాపై ఆసక్తి పెంచేశారు. అలాగే ఇటీవల రిలీజైన టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. విశాల్ ఇందులో సరికొత్తగా కనిపించారు... గుబురు గడ్డంతో ఫైర్ చేస్తున్న విశాల్ లుక్ మరియు ఎస్.జె.సూర్య కామెడి టైమింగ్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
 
ఈ చిత్రానికి సంగీతం జి.వి. ప్రకాష్ అందిస్తుండగా, యాక్షన్ సన్నివేశాలు పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్, సినిమాటోగ్రఫీ అభినందన్ రామానుజం, ఎడిటర్ విజయ్ వేలుకుట్టి  బాధ్యతలు తీసుకున్నారు.
 
మార్క్ ఆంటోనీ టైమ్ ట్రావెల్ థీమ్ చుట్టూ తిరిగే కథ. భారీ యాక్షన్ సన్నివేశాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలతో, అక్కడక్కడ ఎస్.జె.సూర్య కామెడీ టైమింతో ఈ చిత్రం ఆద్యంతం అందరినీ అలరించనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాన్స్ బేస్డ్ కథలు ఇష్టం- బేబీ సినిమా మన జీవితంలో జరిగినట్లుంటుంది : హీరోయిన్ వైష్ణవీ చైతన్య