Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డాన్స్ బేస్డ్ కథలు ఇష్టం- బేబీ సినిమా మన జీవితంలో జరిగినట్లుంటుంది : హీరోయిన్ వైష్ణవీ చైతన్య

Advertiesment
Vaishnavi Chaitanya
, మంగళవారం, 11 జులై 2023 (15:33 IST)
Vaishnavi Chaitanya
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి. ఈ మూవీ జూలై 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర హీరోయిన్ వైష్ణవీ చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలేంటంటే..
 
నా పేరు వైష్ణవీ చైతన్య. యూట్యూబర్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సోషల్ మీడియా ఇంఫ్లూయెన్సర్‌గా కొందరికి తెలుసు. బేబీ అనేది హీరోయిన్‌గా నా మొదటి సినిమా. సాయి రాజేష్ గారు నాకు హీరోయిన్‌గా అవకాశాన్ని ఇచ్చారు.
 
హీరోయిన్ అవ్వాలనే కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పటికి నా ప్రయాణం మొదలుపెట్టి ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ నాకు ఇంత మంచి అవకాశం వస్తుందని అనుకోలేదు. ఈ పాత్ర వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కథ విని షాక్ అయ్యాను. నాకు ఓ మంచి అవకాశం లభించిందని అనుకున్నాను. ఈ పాత్రను పోషిస్తానా? లేదా? అని నా మీద నాకు నమ్మకం లేనప్పుడు సాయి రాజేష్ గారు నన్ను నమ్మారు. నా జీవితానికి ఇది చాలా గొప్ప, పెద్ద అవకాశం.
 
ప్రతీ యాక్టర్‌ అంతిమ లక్ష్యం సినిమానే. ఇన్ స్టాలో వీడియోలు, టిక్ టాక్ వీడియోలు చేస్తే సినిమా హీరోయిన్ అవుతుందా? అని నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. ఈ మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా నా చుట్టూ వాళ్లు నెగెటివ్ కామెంట్లు చేశారు. అది నా మీద చాలానే ప్రభావం చూపించింది. నేను యూట్యూబ్ వరకేనా? అని అనిపించింది. కానీ సాయి రాజేష్ గారు నన్ను నమ్మారు. నాలో ధైర్యాన్ని నింపారు.
 
బేబీ సినిమాలో నాది ఓ బస్తీలో పెరిగే ఓ అమాయకురాలైన అమ్మాయి. బస్తీ నుంచి బయటకు వచ్చిన ఆ అమ్మాయి జీవితం ఎలా మలుపు తిరిగింది? అనేది కథ. ఆ జీవితం నుంచి ఏం నేర్చుకుంటుంది? చిన్నప్పటి నుంచే ఓ అబ్బాయితో ప్రేమలో ఉంటుంది. కాలేజ్‌కు వచ్చాక మరో అబ్బాయి లైఫ్‌లోకి వస్తాడు. ఆ తరువాత ఆ అమ్మాయి జీవితం ఎలా ప్రభావితం అయింది అనేది చక్కగా చూపించారు.
 
సాయి రాజేష్ గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇది మ్యూజిక్ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమా కథ విన్నప్పుడు నా జీవితమే గుర్తుకు వచ్చింది. రియల్ లైఫ్‌లోంచి తీసుకున్న కథ. ఈ కథ, పాత్రతో నేను ఎక్కువగా రిలేట్ అయ్యాను. నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర. ఇది ఎంతో సున్నితమైన పాత్ర.
 
బస్తీ నుంచి కాలేజ్‌కి వచ్చిన అమ్మాయి ఎలా మారిపోయిందని చెప్పేందుకు ఈ కలర్‌ను ఓ మీటర్‌లా తీసుకున్నాం. బ్లాక్ అండ్ వైట్ అనే మీటర్‌లో చూపించలేదు. ఆ అమ్మాయి మీద ఏ విషయాలు ప్రభావితం చూపించాయి.. ఎలా మారిపోయింది? అనే కోణంలోనే చూపించాం. 
 
బేబీ సినిమాకు సైన్ చేసి మూడేళ్లు అవుతుంది. చాలా డెప్త్ ఉన్న సీన్లు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడూ ప్రెజర్ అని ఫీల్ అవ్వలేదు. ఇలాంటి పాత్ర వచ్చినందుకు ఎంతో గర్వపడుతుంటాను. నా ప్రాణం పెట్టి ఈ పాత్రను చేశాను. అమ్మాయి కోణంలోంచి ఈ కథ నడుస్తుంటుంది.
 
షూటింగ్‌ కోసం సెట్‌లోకి వచ్చినప్పుడు భయపడుతూ ఉండేదాన్ని. కానీ టేక్ చెప్పేసరికి మేం ముగ్గురం చర్చించుకుని రెడీగా ఉండేవాళ్లం. ఆ ఇద్దరూ కూడా ఎంతో ఫ్రీడం ఇచ్చారు. డార్క్ లుక్‌లో ఉన్న సీన్‌లే ఎక్కువ ఎంజాయ్ చేశాను. సినిమా చూస్తే ఇది మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది. ఈ సినిమాలో నెగెటివ్, పాజిటివ్, హీరో, హీరోయిన్లు అని ఉండరు. పరిస్థితులే ప్రభావితం చేస్తాయి.
 
తొలిప్రేమ అనేది జీవితంలో ఎప్పటికీ ఓ అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఎప్పటికీ జీవితంలో మధురానుభూతిలా మిగిలిపోతుంది. ఈ సినిమాతోనూ అదే చెప్పబోతోన్నాం.
 
విజయ్ బుల్గానిన్ గారితో మనసే మేఘం అనే ఓ ప్రైవేట్ ఆల్బంలో చేశాను. ఇప్పుడు బేబీ సినిమాను చేశాను. ఈ సినిమాకు ఆయన బెస్ట్ గిఫ్ట్.
 
ఇప్పటి వరకు నేను ఏ కొత్త ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు. నా ఫోకస్ మొత్తం బేబీ మీదే ఉంది. ఈ సినిమా వచ్చాక రెస్పాన్స్ చూడాలి. నేను ఏం చేయగలనో కూడా  అందరికీ ఓ క్లారిటీ వస్తుంది. 
 
ఆడిషన్స్ ఇవ్వడానికి కూడా నేను కష్టాలు పడ్డాను. ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవి. ఎనిమిదేళ్లు కష్టపడ్డాను. సినిమాల మీదే ధ్యాస ఉండేది. ప్రతీ ఫీల్డ్‌లో ఒడిదుడుకులు ఉంటాయి. ఇప్పుడు నేను బేబీ సినిమాతో విజయం సాధించినట్టు అనిపిస్తుంది.
 
తెలుగు అమ్మాయిలకు చాన్స్‌లు ఇవ్వరనే మాట, ప్రచారం ఎలా వచ్చిందో నాకు తెలీదు. అలా ఏం ఉండదు. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే అవకాశాలు వస్తాయి. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసేందుకు ఇష్టం. డాన్స్ బేస్డ్ కథలంటే మరి ఇష్టం. అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రెండ్ అవుతున్న LGM ట్రైలర్..