Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బేబీ చిత్రం ఆనంద్ దేవరకొండకు లాభిస్తుందా!

Advertiesment
Anand Deverakonda, Vaishnavi
, మంగళవారం, 13 జూన్ 2023 (16:38 IST)
Anand Deverakonda, Vaishnavi
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో బేబీ సినిమా ఒకటి. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్.కే.ఎన్ నిర్మించారు.
 
ఈ చిత్రంలోని కొన్ని పాటలు ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను యూట్యూబ్‌ లో విపరీతంగా ఆకట్టుకున్నాయి.  బేబి చిత్రానికి విజయ్ బల్గానిన్‌ సంగీతం అందిస్తున్నాడు.  ముందుగా ఈ సినిమా నుంచి ఓ రెండు మేఘాలిలా, దేవరాజ అని రెండు పాటలు విడుదలై  మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి. ఇక ఈ మధ్య రష్మిక మందాన ఈ సినిమా నుంచి విడుదల చేసిన బ్రేకప్ సాంగ్ ‘ప్రేమిస్తున్నా’ అయితే యూత్ కి వెంటనే కనెక్ట్ అయిపోయి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా నుంచి నాలుగవ పాట కూడా ఈ వారం లో విడుదలకు సిద్ధంగా ఉంది.
 
ఇలా టీజర్ మరియు పాటలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రేక్షకులలో మంచి హైప్ తెచ్చుకోవడమే కాకుండా విడుదల తేదీ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకుల ను ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. అయితే ఇప్పుడు సినీ ప్రియలందరూ ఎదురుచూస్తున్న ఆ అప్డేట్ ఎత్తకేలకి వచ్చేసింది.
 
ఈ చిత్రాన్ని జూలై రెండో వారంలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మేకర్స్ బిజీగా ఉన్నారు. వీటిని కూడా త్వరగా పూర్తి చేసుకొని జూలైలో అందరినీ అలరించడానికి సిద్ధమవుతుంది ఈ సినిమా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జవాన్ ప్రమోషన్ కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకున్న షారూక్ ఖాన్‌