Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బేబీ థర్డ్ సింగిల్ 'ప్రేమిస్తున్నా' నాకు ఎంతో బాగా నచ్చింది.. రష్మిక మందాన్న

Advertiesment
Rashmika, anandh and others
, బుధవారం, 17 మే 2023 (15:42 IST)
Rashmika, anandh and others
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. 'ప్రేమిస్తున్నా' అనే మూడో పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ పాటను నేషనల్ క్రష్ రష్మిక మందాన్న చేతుల మీదుగా విడుదల చేయించి చిత్రయూనిట్.
 
రష్మిక మందాన్న మాట్లాడుతూ.. 'ఈ రోజు రిలీజ్ చేసిన సాంగ్ నాకు బాగా నచ్చింది. ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే పాటను లూప్ మోడ్‌లో వింటూనే ఉన్నాను. ఆనంద్‌ మ్యూజిక్‌ టేస్ట్‌కు నేను ఫ్యాన్. బేబీ టీంకు ఆల్ ది బెస్ట్. విరాజ్, వైష్ణవికి కంగ్రాట్స్. నన్ను ఈవెంట్‌కు పిలిచినందుకు టీంకు థాంక్స్' అని అన్నారు.
 
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. 'మా సినిమా జూలైలో రాబోతోంది. ఇంతే ప్రేమను థియేటర్లో కూడా చూపిస్తారని కోరుకుంటున్నాను. సినిమాను ప్రేక్షకులకు నచ్చేలా తీసేందుకు పగలు రాత్రి కష్టపడుతున్నాం. ఇది ఒక మ్యూజికల్ ఫిల్మ్. సినిమా రిలీజ్ అయిన తరువాత అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. సందీప్ రాజ్ తీసిన కలర్ ఫోటో నాకు ఎంతో ఇష్టం. ఇంత బిజీగా ఉన్నా మారుతి గారు మాకోసం వచ్చినందుకు థాంక్స్. ఎస్‌కేఎన్ గారు ఇది చిన్న సినిమా అని కాకుండా.. ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున చేస్తున్నారు. ఈ సినిమాలో పని చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా కోసం వచ్చిన రష్మికకు థాంక్స్. ఓ నలభై, యాభై ఏళ్ల తరువాత కూడా ఈ పాటను వింటాం. విరాజ్, వైష్ణవిలకు థాంక్స్. బేబీ సినిమా అందరికీ నచ్చతుంది' అని అన్నారు.
 
నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు ఇంత మంచి మ్యూజిక్ రావడానికి కారణం విజయ్ బుల్గానిన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు విజయ్ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ మాట విని అప్పుడే ఆయనతో పని చేయాలని ఫిక్స్ అయ్యాను. విజయ్ టాలెంట్‌ వల్లే ఈ సినిమా పాటలు ఇంతగా హిట్ అయ్యాయ'ని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవల్లి పాత్రకు రష్మిక కంటే పక్కా ఫిట్ నేనే.. ఐశ్వర్యా రాజేష్