Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అద్భుతం అనేలా బేబీ చిత్రం నుంచి సెకండ్ లిరికల్ సాంగ్

Vaishnavi Chaitanya
, సోమవారం, 3 ఏప్రియల్ 2023 (19:52 IST)
Vaishnavi Chaitanya
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’.ఈ చిత్రం నుంచి గతంలో విడుదల చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ రిలికల్ సాంగ్ ను విడుదల చేసింది మూవీ టీమ్. మొదటి పాటకు పూర్తి భిన్నంగా ఉంటూనే వైవిధ్యమైన టోన్ లో మరో అద్భుతమైన పాటలా కనిపిస్తోంది. ఈ పాటను మళయాలంలో మోస్ట్ ఫేమస్ సింగర్ గా పేరు తెచ్చుకున్న ఆర్య దయాళ్ చేత పాడించారు. అంతే కాదు.. ఓ పెద్ద బడ్జెట్ సినిమా రేంజ్ లో భారీ సెట్స్ వేసి మరీ ఈ గీతాన్ని వీడియోగానూ చిత్రీకరించారు. ఆ పాటలో ఆర్యదయాళ్ స్వయంగా యాక్ట్ చేయడం విశేషం.  
విజయ్ బుల్గానిన్ స్వరపరిన ఈ గీతాన్ని త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి రాశారు. 
 
సంస్కృత పదాలతో మొదలైన పాట ఆసాంతం కట్టిపడేశాలా సాహిత్యం, కంపోజింగ్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతం నుంచి నగరంలోని పెద్ద కాలేజ్ కు చదువుకోవడానికి వెళ్లిన ఓ అమ్మాయికి కనిపించే కొత్త ప్రపంచం అంతా నిజం కాదనీ.. ‘నిజమనుకునే క్రీనీడలే అడుగడుగునా ఉంటాయనీ.. తెలుపదు కదా ఓ పాఠమై చదువే.. భ్రమల మైకాన భ్రమణమే చేసి భ్రమరమవుతుంది కాలమే’.. అనే  అద్భుతమైన సాహితీ విలువలున్న ఈ గీతం మాంటేజ్ సాగే పాటలా ఉంది. మొదటి పాటకు వచ్చిన రెస్పాన్స్ తర్వాత కథను ముందుకు నడిపించేలా ఉన్న ఈ గీతం కూడా బేబీపై అంచనాలు పెంచేలా ఉంది. మ్యూజికల్ గా బేబీ మరో సంచలనం కాబోతోందని రెండో పాట కూడా చూసిన తర్వాత అర్థం అవుతోంది. 
హృదయ కాలేయం, కలర్ ఫోటో, కొబ్బరిమట్ట చిత్రాలతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మించిన చిత్రం ఇది.. 
 
ఇక త్వరలోనే విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీష తదితరులు నటించారు. 
 
టెక్నీకల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న ఈ చిత్రానికి సంగీతంః విజయ్ బుల్గానిన్, ఎడిటింగ్ః విప్లవ్ నైషధం, సినిమాటోగ్రఫీః ఎమ్ఎన్ బాల్ రెడ్డి, పి.ఆర్.వోః జిఎస్.కే మీడియా, కో ప్రొడ్యూసర్ః ధీరజ్ మొగిలినేని, నిర్మాతః ఎస్.కే.ఎన్, రచన, దర్శకత్వంః సాయి రాజేశ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగు భాష‌ల్లో అరుణ్ విజ‌య్ భారీ చిత్రం మిషన్: చాప్ట‌ర్ 1