Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాలుగు భాష‌ల్లో అరుణ్ విజ‌య్ భారీ చిత్రం మిషన్: చాప్ట‌ర్ 1

Advertiesment
Arun Vijay, Amy Jackson
, సోమవారం, 3 ఏప్రియల్ 2023 (19:45 IST)
Arun Vijay, Amy Jackson
లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. కోలీవుడ్ హీరో అరుణ్ విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘మిషన్:  చాప్ట‌ర్ 1’  తాజాగా లైకా ప్రొడక్ష‌న్స్ నుంచి రాబోతున్న‌క్రేజీ చిత్రాల సినిమాల లిస్టులో చేరింది.  ఈ చిత్రానికి ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మాత‌లు.
 
సినీ ఇండ‌స్ట్రీలో దిగ్గ‌జ చిత్రాలుగా అంద‌రి ఆద‌రాభిమానాల‌ను పొందిన 2.0, పొన్నియిన్ సెల్వ‌న్, ఇండియన్ 2 వంటి చిత్రాలు స‌హా ఎన్నో భారీ చిత్రాల‌ను లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ‘మిషన్:  చాప్ట‌ర్ 1’ సినిమాను విశ్లేషించి ఒక ప‌రిమిత‌మైన హ‌ద్దుల‌ని లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని భావించింది లైకా టీమ్‌. ఈ క్ర‌మంలో భాషా ప‌ర‌మైన హ‌ద్దుల‌ను ఈ సినిమా దాటుతుంద‌ని లైకా ప్ర‌తినిధులు భావించారు. దీంతో లైకా సంస్థ ‘మిషన్:  చాప్ట‌ర్ 1’ చిత్రాన్ని నాలుగు భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల‌ చేయ‌టానికి సిద్ధ‌మైంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌, ఆడియో, థియేట్రిక‌ల్ రిలీజ్‌కి సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు నిర్మాత‌లు.
 
విల‌క్ష‌ణ‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించే  ప్ర‌తిభ ఉన్న ద‌ర్శ‌కుడు విజ‌య్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆయ‌న‌ చిత్ర నిర్మాణంలోని ప‌లు విభాగాల‌తో పాటు ప్ర‌జ‌ల అభిరుచుల‌ను ఆధారంగా చేసుకుని సినిమాల‌ను రూపొందిస్తుంటారు.  ‘మిషన్:  చాప్ట‌ర్ 1’ చిత్రాన్ని కేవ‌లం 70 రోజుల్లో లండ‌న్‌, చెన్నై స‌హా ప‌లు లొకేష‌న్స్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌రించటం గొప్ప విష‌యం.
 
అద్భుత‌మైన టెక్నిక‌ల్ అంశాల‌తో రూపొందిన ‘మిషన్:  చాప్ట‌ర్ 1’ చిత్రం హీరో అరుణ్ విజ‌య్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతుంద‌న‌టంలో సందేహం లేదు. చాలా గ్యాప్ త‌ర్వాత.. 2.0లో న‌టించి అలరించిన ముద్దుగుమ్మ‌ ఎమీ జాక్స‌న్ ఈ చిత్రంతో సినిమాల్లో అడుగు పెడుతున్నారు. జైలును సంర‌క్షించే ఆఫీస‌ర్ పాత్ర‌లో ఆమె క‌నిపించ‌నున్నారు. మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన  విల‌క్ష‌ణ న‌టి నిమిషా స‌జ‌య‌న్ ఈ మూవీలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. జి.వి.ప్ర‌కాష్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యాన్ని వ‌హిస్తున్నారు.
 
ఈ సినిమా కోసం లండ‌న్ జైలును పోలి ఉండేలా చెన్నైలో భారీగా ఖ‌ర్చుతో ఓ జైలు సెట్ వేశారు. స్టంట్ సిల్వ ఈ చిత్రానికి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఆయ‌న యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాను చూసే ప్రేక్ష‌కుల‌కు ఆహా అనిపిస్తాయి. ఈ సినిమాలో చిత్రీక‌రించిన నైట్ షాట్స్‌, డ్రామా ప్రేక్ష‌కుల‌ను ఉత్కంఠ‌త‌కు లోను చేస్తుంది.
 
న‌టీన‌టులు:*  అరుణ్ విజ‌య్‌, ఎమీ జాక్స‌న్‌, నిమిషా స‌జ‌య‌న్‌, అబి హాస‌న్‌, భ‌ర‌త్ బొప‌న్న‌, బేబి ఇయ‌ల్‌, విరాజ్ ఎస్‌, జాస‌న్ షా
 
*సాంకేతిక‌వ‌ర్గం:*ద‌ర్శ‌క‌త్వం:  విజ‌య్, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌:  జికెఎం త‌మిళ్ కుమర‌న్‌, నిర్మాత - సుభాస్క‌ర‌న్‌, ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి, కో ప్రొడ్యూస‌ర్‌:  సూర్య వంశీ ప్ర‌సాద్ కోత‌, జీవ‌న్ కోత‌, మ్యూజిక్‌:  జి.వి.ప్ర‌కాష్ కుమార్‌, స్క్రిప్ట్‌, స్క్రీన్ ప్లే:  ఎ.మ‌హ‌దేవ్‌, డైలాగ్స్‌:  విజ‌య్‌, సినిమాటోగ్ర‌ఫీ:  సందీప్ కె.విజ‌య్‌, ఎడిట‌ర్‌:  ఆంథోని, స్టంట్స్ సిల్వ‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  శ‌ర‌వ‌ణ‌న్ వ‌సంత్‌, కాస్ట్యూమ్స్ :  రుచి మునోత్‌, మేక‌ప్‌: ప‌ట్టనం ర‌షీద్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  వి.గ‌ణేష్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  కె.మ‌ణి వ‌ర్మ‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్ (యుకె):  శివ కుమార్‌, శివ శ‌ర‌వ‌ణ‌న్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ :  మ‌నోజ్ కుమార్‌.కె, కాస్ట్యూమ‌ర్‌:  మొడేప‌ల్లి ర‌మ‌ణ‌, సౌండ్ డిజైన్‌:  ఎం.ఆర్‌.రాజ‌శేఖ‌ర‌న్‌, వి.ఎఫ్‌.ఎక్స్‌:  డినోట్‌, స్టిల్స్‌:  ఆర్‌.ఎస్‌.రాజా, ప్రమోష‌న్‌, స్ట్రాట‌జీస్‌:  షియం జాక్‌, పి.ఆర్‌.ఒ:  నాయుడు సురేంద్ర కుమార్ , ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  ప్ర‌తూల్ ఎన్‌.టి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ మహేష్, చిరంజీవి అభినందనలు ఆనందంతో పాటు భాద్యత పెంచుతుంది : నాని