Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషి వేసుకున్న మరో వేషం మోసం- పాటను ఆవిష్క‌రించిన తమ్మారెడ్డి

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (15:58 IST)
K3- song- Baradwaja
ఈ ప్రపంచంలో జరిగే ప్రతి హింస‌కూ "కీర్తి-కాంత-కనకం"లో ఏదో ఒకటి కారణంగా నిలుస్తుందనే వాస్తవాన్ని కథాoశంతో కె.3" (కీర్తి-కాంత-కనకం) రూపొందుతోంది. సీనియర్ దర్శకుడు సముద్ర శిష్యుడు ఆదిత్య వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రొక్కం భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
 
 'మగువ' ఫేమ్ సురేష్ బాబు, వశిష్ట చౌదరి (ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఫేమ్) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మాణిక్, శ్రీనివాస్ రెడ్డి, జొన్నలగడ్డ, సంధ్య, ప్రవీణ్ బాహు, రాజీవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది. 
 
తాజాగా ఈ చిత్రంలోని "మనిషి వేసుకున్న మరో వేషం మోసం" అనే పాటను ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫిల్మ్ ఛాంబర్ లో ఆవిష్కరించి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. చిన్ని కృష్ణ స్వరసారథ్యంలో రూపొందిన ఈ గీతాన్ని రవి మాదగోని రాయగా ధనుంజయ్ ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు వి.సముద్ర, చిత్ర నిర్మాత రొక్కం భాస్కర్ రెడ్డి, దర్శకుడు ఆదిత్య వంశీ, గీత రచయిత రవి మాదగోని పాల్గొన్నారు.
 
నిర్మాత రొక్కం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, సెన్సార్ కోసం సన్నాహాలు చేస్తున్నాం. ఆదిత్య వంశీ దర్శకత్వం, చిన్నికృష్ణ సంగీతం, రవి మాదగోని పాటలు, ఆరిఫ్ లలాని (మిణుగురులు ఫేమ్) ఛాయాగ్రహణం, ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ "కె-3" చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయి. కంటెంట్ ఉండే సినిమాలకు మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. కాబట్టి "కె-3" చిత్రాన్ని కచ్చితం ఆదరిస్తారనే కాన్ఫిడెన్స్ మాకుంది. ఈ చిత్రంలోని పాటను విడుదల చేసి, మమ్మల్ని అభినందించిన తమ్మారెడ్డిగారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు" అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

అయ్యప్ప భక్తులకు అండగా నిలిచిన నారా లోకేష్.. పనితీరు భేష్

యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌గా మారనున్న రుషికొండ ప్యాలెస్‌?

విషం తాగింది.. ఆపై ఆస్పత్రి భవనం నుంచి దూకేసింది.. ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments