Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 5 March 2025
webdunia

K-3 (కీర్తి-కాంత-కనకం)లో సక్సెస్ కళ కనబడుతోందిః ప్ర‌ముఖ వ‌క్త‌లు

Advertiesment
K-3 (కీర్తి-కాంత-కనకం)లో సక్సెస్ కళ కనబడుతోందిః ప్ర‌ముఖ వ‌క్త‌లు
, మంగళవారం, 17 ఆగస్టు 2021 (19:52 IST)
K-3 trailer
సీనియర్ దర్శకుడు సముద్ర శిష్యుడు ఆదిత్య వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ట్రైడెంట్ మూవీ క్రియేషన్స్ పతాకంపై రొక్కం భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న కంటెంట్ బేస్డ్ క్రైమ్ ఎంటర్టైనర్ "కె.3". (కీర్తి-కాంత-కనకం). ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్‌లో జరిగింది. తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, ప్రముఖ దర్శకులు సముద్ర ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రబృందాన్ని అభినందించారు. 'K-3' ట్రైలర్ లో సక్సెస్ కళ చాలా స్పష్టంగా కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. 
 
స్వర్గీయ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులైన యు.విశ్వేశ్వరరావు తీసిన "కీర్తి-కాంత-కనకం" అప్పట్లో ఘన విజయం సాధించిందని ప్రసన్నకుమార్ గుర్తు చేశారు.
తన శిష్యుడు ఆదిత్యవంశీ "కె-3"తో చాలా పెద్ద హిట్ కొట్టాలని సముద్ర అభిలషించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ వశిష్ట చౌదరి, సినిమాటోగ్రాఫర్ ఆరిఫ్ లలాని, గీత రచయిత రవి మాదగోని, ఎడిటర్ సునీల్, ఈ చిత్రంలో నటించిన రాజీవ్, ప్రవీణ్, సంధ్య తదితర చిత్ర బృందం పాలుపంచుకుంది. నిర్మాత తనయుడు చిరంజీవి హర్షిత్ రెడ్డి (లక్కీ) జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్య అతిధులు ప్రసన్నకుమార్-సముద్ర కేక్ కట్ చేయించారు.
 
దర్శక నిర్మాతలు ఆదిత్య వంశీ- రొక్కం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, "కాన్సెప్ట్ బేస్డ్ మూవీ "కె-3". కథే హీరో అండ్ విలన్. యూనిట్ సభ్యుల సహాయ సహకారం, సముద్ర గారి మార్గదర్శకత్వంలో ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో సినిమా రూపొందించాం. సెన్సార్ కోసం సన్నాహాలు చేస్తున్నాం. చిన్నికృష్ణ సంగీతం, రవి మాదగోని పాటలు, ఆరిఫ్ లలాని (మిణుగురులు ఫేమ్) ఛాయాగ్రహణం, ఆర్టిస్ట్స్  హైలైట్ అని అన్నారు.
 'మగువ' ఫేమ్ సురేష్ బాబు, వశిష్ట చౌదరి (ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఫేమ్) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మాణిక్, శ్రీనివాస్ రెడ్డి, జొన్నలగడ్డ, సంధ్య, ప్రవీణ్ బాహు, రాజీవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 
ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఫైట్స్: మల్లి మాస్టర్, పాటలు: రవి మాదగోని, సింగర్స్: ధనంజయ్-రచిత రాయప్రోలు, సంగీతం: చిన్నికృష్ణ, ఎడిటింగ్: సునీల్, సినిమాటోగ్రఫీ: ఆరిఫ్ లలాని, నిర్మాత: రొక్కం భాస్కర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: ఆదిత్య వంశీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ నిధి సేక‌ర‌ణ‌- అంత‌ర్జాతీయ స్థాయిలో మెగాస్టార్ చిరంజీవి