స్టార్ డైరక్టర్ మణిరత్నంకు గుండెపోటు.. పరిస్థితి?

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (12:23 IST)
భారతీయ చిత్ర పరిశ్రమలో లెజండ్రీ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన మణిరత్నంకు గుండెపోటుకు గురయ్యారు. ఈ కారణంగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 
 
ముఖ్యంగా, ఆయనకు గుండెపోటు రావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు.. అభిమానులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆయనను చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స పొందుతున్నారు. 
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పలువురు సినీ ప్రముఖులు కోరారు.
 
కాగా, 2004లో 'యువ' సినిమా షూటింగ్‌ వేళ, మణిరత్నంకు తొలిసారి గుండెపోటు వచ్చింది. సెట్‌‌లో ఉన్న వేళ, తన ఛాతిలో నొప్పిగా ఉందని ఆయన చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు. 
 
ఆ తర్వాత 2015 సంవత్సరంలో 'ఓకే బంగారం' షూటింగ్ వేళ కాశ్మీర్‌లో, 2018లో మరోసారి ఆయనకు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయన 'పొన్నియన్‌ సెల్వన్‌' అనే హిస్టారికల్ మూవీ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

G20 శిఖరాగ్ర సమావేశం.. జోహెన్స్‌బర్గ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం (video)

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments