Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోర్కె తీర్చలేదనీ కొట్టి చంపేశాడు.. తాపీమేస్త్రి కిరాతక చర్య

Advertiesment
Vizag
, శనివారం, 1 జూన్ 2019 (15:59 IST)
విశాఖపట్టణంలోని అరకులోయ మండలానికి చెందిన యువతి (19)పై 23 యేళ్ల తాపీమేస్త్రి అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. అయితే, ఆమె లొంగకపోగా, ఆ కామాంధుడి చర్యను ప్రతిఘటించింది. దీంతో కోపోద్రిక్తుడైన తాపీమేస్త్రి ఆమెను గట్టిగా కొట్టి మెట్లపై తోసేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువతి ఆస్పత్రి చికిత్స పొందుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వైజాగ్‌లోని అచ్యుతాపురంలోని జంగులూరు జంక్షన్‌ దగ్గర ఒక ఆపార్టుమెంటు నిర్మాణం జరుగుతోంది. ఇందులో 19 యేళ్ళ యువతి భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తుంటే, ఇక్కడే బాణాల సురేష్ (23) అనే యువకుడు తాపీమేస్త్రిగా ఉన్నాడు. ఈయనకు ఆ యువతితో శారీరక సుఖం తీర్చుకోవాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంటే, ఆ యువతి తిరస్కరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి యువతిని బలవంతం చేయబోగా ప్రతిఘటించింది. 
 
దీంతో కోపోద్రిక్తుడైన సురేష్‌… ఆమెను తీవ్రంగా కొట్టి మెట్లపై నుంచి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతిచెందినట్టు ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపారు. ఈ ఘటనపై ఎలమంచిలి సీఐ విజయనాథ్‌ శుక్రవారం విచారణ చేపట్టారు. సురేష్‌పై అట్రాసిటీ, అత్యాచారం, హత్య కేసులను నమోదు చేసి అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కర్ట్ ధరించి వస్తేనే బోనస్ : మహిళలకు రష్యా కంపెనీ ఆఫర్