Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ‌ర‌వీరుని పిల్ల‌ల‌కు ఉచిత విద్య అందిస్తున్న మంచు ఫ్యామిలీ

Webdunia
శనివారం, 10 జులై 2021 (17:21 IST)
Mohanbabu awaldar family
చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, రెడ్డివారి పల్లి గ్రామానికి చెందిన 36 సం||లు వయసు కల్గిన సి.హెచ్. ప్రవీణ్ కుమార్ భారత సైన్యంలో అవల్దార్ గా పని చేస్తున్నాడు. శ్రీనగర్ 18వ రెజిమెంటులో విధులు నిర్వర్తిస్తుండగా ఉగ్రవాదులతో జరిగిన ఎదురుదాడిలో నవంబరు 8వ తేది, 2020 సం|| తుపాకి కాల్పులలో వీరమరణం పొందాడు.
 
ఇతడికి రజిత అనే భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అందరూ వీరిని పరామర్శించారే కానీ ప్రభుత్వసాయం తప్ప వీరికి ఇతర ఎటువంటి సహాయమూ అందలేదు. వీరి కుటుంబంలో 64 మంది సభ్యులు భారతసైన్యంలో పని చేస్తున్నారు.
 
ప్రవీణ్ కుమార్ కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకున్న 18వ రెజిమెంట్ అధికారి కల్నల్ OLV, నరేష్, కమాండింగ్ ఆఫీసర్, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఛైర్మన్ డా॥ మోహన్ బాబు గారికి స్వయంగా లేఖ వ్రాశారు. వారి కుటుంబాన్ని ఏ విధంగానైనా ఆదుకోమని లేఖ ద్వారా కోరారు.
 
ఆ లేఖను చూసి స్పందించిన డా॥ మోహన్ బాబు గారు వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ కుమార్తె సి.హెచ్. లోహితకు ఈ విద్యా సంవత్సరం 4వ తరగతి నుండి పూర్తి ఉచితవిద్య నందించడానికి ఎంతో సహృదయంతో, ఉదారగుణంతో, మానవతా దృష్టితో అంగీకరించారు.
 
Vishnu awaldar family
ఇందుకు ఎంతో సంతోషించిన ప్రవీణ్ కుమార్ భార్య ఉచితవిద్యకు సహకరించిన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల CEO విష్ణు మంచు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
 
దీనికి ప్రతిస్పందించిన CEO విష్ణు మంచు గారు ఎంతో ఆర్ద్రతతో మాట్లాడారు. ఇందుకు కృతజ్ఞతలు అక్కర్లేదన్నారు. దేశ సరిహద్దులో భారత వీరులు కంటికి రెప్పలా కాపాడుతుండడం వల్ల మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం. వారిని ఆదుకోవడం, అండగా నిలవడం, చేతనైన సహాయం చెయ్యడం. ప్రతి భారతీయుని బాధ్యత అని ఆమెను ఓదార్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments