Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరుచుకున్న ధర్మస్థలి తలుపులు... సిద్ధ న్యూ లుక్ రిలీజ్

Webdunia
శనివారం, 10 జులై 2021 (17:11 IST)
మెగాస్టార్ చిరంజీవి -  దర్శకుడు కొరటల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చెర్రీ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇపుడు ఆఖరి షెడ్యూల్‌లో అడుగుపెట్టింది. 
 
కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి కారణంగా చిత్ర షూటింగ్‌ను నిలిపివేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో 'ఆచార్య' షూటింగ్ మళ్లీ ప్రారంభమైందని చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొ కంపెనీ వెల్లడించింది. 
 
"ధర్మస్థలి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి" అంటూ ట్వీట్ చేసింది. అందరినీ అలరించేలా త్వరలోనే 'ఆచార్య' నుంచి అప్ డేట్లు రానున్నాయని తెలిపింది. కొణిదెల ప్రొ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక. రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments