Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోయిన్ కంపెనీలో మేల్ ఎంప్లాయీస్‌కు బంపర్ ఆఫర్...

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా సారథ్యంలో పర్పుల్ పెబ్బెల్ ప్రొడక్షన్ పేరుతో ఓ కంపెనీ నడుస్తోంది. ఈ కంపెనీలో పని చేసే స్త్రీ, పురుష ఉద్యోగులకు ఆమె ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది అయితే, పురుషులతో పోల్చితే స్త

Webdunia
బుధవారం, 18 జులై 2018 (21:39 IST)
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా సారథ్యంలో పర్పుల్ పెబ్బెల్ ప్రొడక్షన్ పేరుతో ఓ కంపెనీ నడుస్తోంది. ఈ కంపెనీలో పని చేసే స్త్రీ, పురుష ఉద్యోగులకు ఆమె ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది అయితే, పురుషులతో పోల్చితే స్త్రీలకే మరిన్ని ఆఫర్లు ఇచ్చారు.
 
ఇదే అంశంపై ఆమె మేనేజర్, తల్లి మధు చోప్రా మాట్లాడుతూ, తమ కంపెనీలో పని చేసే మహిళా ఉద్యోగినులలో ఎక్కువ మంది వివాహితులేనని, దీంతో వారికి అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పులు చేసినట్టు తెలిపారు. ముఖ్యంగా, మహిళల ఆలోచనలు, అభిప్రాయాలకి విలువనివ్వాలి కాబట్టి వారి పనివేళలలో మార్పులు చేసినట్టు తెలిపారు. 
 
ప్రధానంగా 12 వారాల పాటు ప్రసూతి సెలవులు మంజూరు చేసి, ఆ దినాలలో నగదు సాయం చేయనున్నట్టు తెలిపారు. అలాగే, మేల్ ఎంప్లాయీస్‌కు కూడా మగవారి పట్ల కూడా మేం సానుకూలంగానే ఉన్నట్టు తెలిపారు. ఇటీవల మా కంపెనీలో పని చేస్తున్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌కి పెటర్నిటీ లీవు కింద నాలుగు వారాల పాటు సెలవు మంజూరు చేసినట్టు ఆమె తెలిపారు. ఇలా తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు అన్ని రకాల వెసులుబాటుతోపాటు వివిధ రకాల సహాయ సహకారాలను అందిస్తున్నట్టు తెలిపారు. 
 
కాగా, ప్రస్తుతం హాలీవుడ్‌లో 'ఎ కిడ్‌ లైక్‌ జేక్', 'ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్' అనే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు 'క్వాంటికో' అనే సీరియల్ కూడా చేస్తుంది. త్వరలో భారత్ అనే బాలీవుడ్ సినిమాలో సల్మాన్ సరసన ప్రియాంక చోప్రా నటించనుంది. 

సంబంధిత వార్తలు

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments