Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యాస్టింగ్ కౌచ్‌ మేల్ ఆర్టిస్టులకూ వుంది.. తొడలపై చెయ్యేసి.. ప్యాంట్ లోపలికి?

సినీ రంగంలో క్యాస్టింగ్ కౌచ్‌పై ప్రస్తుతం పెద్ద రచ్చే జరుగుతోంది. నటీమణుల ఉదంతాలు దాదాపు అన్నీ భాషల ఇండస్ట్రీల్లో వెలుగు చూస్తున్నాయి. కానీ కేవలం హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలో ఈ వ్యవహారం

Advertiesment
క్యాస్టింగ్ కౌచ్‌ మేల్ ఆర్టిస్టులకూ వుంది.. తొడలపై చెయ్యేసి.. ప్యాంట్ లోపలికి?
, శనివారం, 14 జులై 2018 (17:58 IST)
సినీ రంగంలో క్యాస్టింగ్ కౌచ్‌పై ప్రస్తుతం పెద్ద రచ్చే జరుగుతోంది. నటీమణుల ఉదంతాలు దాదాపు అన్నీ భాషల ఇండస్ట్రీల్లో వెలుగు చూస్తున్నాయి. కానీ కేవలం హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలో ఈ వ్యవహారం జరగలేదని.. మేల్‌ ఆర్టిస్టులకు కూడా వేధింపులు తప్పటం లేదని ఓ యువనటుడు ఆరోపించాడు. 
 
మాలీవుడ్‌కు చెందిన నవజీత్ నారాయణ్ అనే టాలెంటెడ్‌ హీరో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఓ చిత్రం సందర్భంగా దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించిన తీరును అతను వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఎంతో కష్టాలు పడ్డానని.. ఆ సమయంలో ఓ సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని ఓ దర్శకుడు ఆఫీస్‌కు రమ్మన్నాడు. తీరా అక్కడికెళ్లాక గదిలోకి రమ్మని తేడాగా ప్రవర్తించాడు. నా తొడలపై చెయ్యేసి, ప్యాంట్‌ లోపలికి చెయ్యి పోనిచ్చాడు.
 
కానీ తనకు చిర్రెత్తుకొచ్చి.. అతని చెంప పగులకొట్టా. ఆపై ఆ దర్శకుడికి వార్నింగ్ కూడా ఇచ్చి అక్కడి నుంచి వచ్చేశా. తర్వాతే తెలిసింది అతనో హోమో సెక్సువల్‌ అని..  ఇండస్ట్రీలో మహిళలకే కాదు.. మేల్‌ ఆర్టిస్టులకు కూడా రక్షణ లేదంటూ నవజీత్ నారాయణ పోస్టు చేశాడు. అయితే ఆ దర్శకుడి పేరు మాత్రం బయటికి చెప్పేందుకు నవజీత్ నిరాకరించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సునయనకు ఓటు వేసిన ఆ ఇద్దరు వెర్రివాళ్లా? బిగ్ బాస్ ఇంట్లో తమాషా...