Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్‌ను షేక్ చేసిన 'జిమ్మిక్కి కమ్మల్' పాట తొలగింపు.. ఎందుకు?

మ‌ల‌యాళ మెగాస్టార్ మోహన్ లాల్ న‌టించిన చిత్రం "వెళిపడింతె పుస్తకం". ఈ చిత్రంలోని 'జిమ్మిక్కి కమ్మల్' పాట ఎంత పాపుల‌ర్ అయిందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. భాషా భేదం లేకుండా ఈ సాంగ్‌ని ప్ర‌తి ఒక్క‌రు ఆడిపా

Webdunia
ఆదివారం, 8 జులై 2018 (16:48 IST)
మ‌ల‌యాళ మెగాస్టార్ మోహన్ లాల్ న‌టించిన చిత్రం "వెళిపడింతె పుస్తకం". ఈ చిత్రంలోని 'జిమ్మిక్కి కమ్మల్' పాట ఎంత పాపుల‌ర్ అయిందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. భాషా భేదం లేకుండా ఈ సాంగ్‌ని ప్ర‌తి ఒక్క‌రు ఆడిపాడారు. కొంద‌రు పేర‌డీలు చేశారు. వేరే భాష‌ల‌కి చెందిన సెల‌బ్రిటీలు కూడా ఈ పాటను ఎంతగానో ఇష్టపడ్డారు.
 
ఒక విధంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీతో పాటు యూట్యూబ్‌ను కూడా షేక్ చేసింది. యూ ట్యూబ్‌లో ఈ పాటకు దాదాపు 80 మిలియ‌న్లకుపైగా వ్యూస్ వచ్చాయి. అలాంటి పాటను ఇపుడు యూట్యూబ్ నుండి తొల‌గించారు. ఈ విష‌యాన్ని సంగీత ద‌ర్శ‌కుడు షాన్ రెహ‌మాన్ త‌న ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు.
 
'వెళిపడింతె పుస్తకం' చిత్ర కాపీ రైట్స్ ఓ ఛానెల్ కొనుక్కుంది. కాపీ రైట్ కార‌ణాల వ‌ల‌న ఆ సాంగ్‌ని తొల‌గించారంటూ రెహ‌మాన్ తెలిపారు. అయితే యూట్యూబ్ నుండి అలా తొల‌గించ‌డంపై నెటిజ‌న్లు మండిపడుతున్నారు. ఏదేమైన అంద‌రిని అంత‌గా ఓ ఊపు ఊపిన ఆ సాంగ్ ఇంట‌ర్‌నెట్‌లో లేక‌పోవ‌డంపై అనేక మంది నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments