Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'జామురాతిరి జాబిలమ్మ' హిట్‌సాంగ్స్

బాలనటిగా, యువనటిగా, ప్రౌఢనటిగా కొన్నితరాలను అలరించిన శ్రీదేవి మరణం నమ్మలేని నిజంగా మిగిలిపోనుంది. ఎదిగే కూతుళ్ల ఆలనాపాలనా చూసుకోవాలని మురిసిపోయిన శ్రీదేవి శనివారం రాత్రి దుబాయ్‌లో తన మేనల్లుడి వివాహాన

'జామురాతిరి జాబిలమ్మ' హిట్‌సాంగ్స్
, సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (10:40 IST)
బాలనటిగా, యువనటిగా, ప్రౌఢనటిగా కొన్నితరాలను అలరించిన శ్రీదేవి మరణం నమ్మలేని నిజంగా మిగిలిపోనుంది. ఎదిగే కూతుళ్ల ఆలనాపాలనా చూసుకోవాలని మురిసిపోయిన శ్రీదేవి శనివారం రాత్రి దుబాయ్‌లో తన మేనల్లుడి వివాహానికి హాజరై హోటల్ గదిలో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆమె చనిపోయారు. 
 
అయితే, ఈ 'అతిలోకసుందరి' నటించిన చిత్రాల్లోని అనేక గీతాలు ఎప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటాయి. ఈ పాటలు ఉన్నంతకాలం ఆమె ప్రతి ఒక్కరి మనసుల్లో చిరస్థాయిగా గూడుకట్టుకునివుంటారు. శ్రీదేవి అనే నటి ఒకరున్నారనీ గుర్తుకొస్తే ఎన్నో మరపురాని గీతాలు మస్తిష్కంలో కదలాడుతుంటాయి. శ్రీదేవి నటించిన తెలుగు చిత్రాల్లో అమితంగా జనాదరణ పొందిన కొన్ని గీతాలివి..
 
1. సిరిమల్లెపువ్వా.. సిరిమల్లెపువ్వా.. చిన్నారి చిలకమ్మా..(పదహారేళ్ల వయస్సు)
2. నా కళ్లు చెబుతున్నాయి... నిన్ను ప్రేమించానని.. (ప్రేమాభిషేకం) 
3. అబ్బనీ.. తియ్యనీ.. దెబ్బ.. ఎంత కమ్మగా ఉందిరో అబ్బ (జగదేగవీరుడు అతిలోక సుందరి)
4. వెన్నెలయినా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా.. (పచ్చని కాపురం)
5. వెల్లువచ్చి గోదారమ్మా ఎల్లాకిల్లా పడ్డాదమ్మా (దేవత)
6. అమ్మ బ్రహ్మదేవుడో ఎంత గొప్ప సొగసురో..(గోవిందా గోవిందా)
7. జామురాతిరి.. జాబిలమ్మా, అమ్మాయి ముద్దు ఇవ్వందే. (క్షణ క్షణం)
8. కన్నెపిల్లవని.. కన్నులున్నవని..(ఆకలిరాజ్యం)
9. అందాలలో.. అహో.. మహోదయం (జగదేకవీరుడు అతిలోక సుందరి)
10. ఆకుచాటు పిందెతడిసే.. (వేటగాడు)
13. కలగా కల్పనగా కనిపించెను (వసంతకోకిల)
14. నమస్తే సుస్వాగతం..(కిరాయి కోటిగాడు)
15. ఈ బుగ్గ మీద గోరుగిచ్చుడు ఏంటబ్బా (వజ్రాయుధం)
16. పంటచేలలో (పదహారేళ్ల వయసు)
17. తెల్లచీర.. మల్లెపూలు(సర్దార్ పాపారాయుడు)
18. ఇది ఒకటో నంబర్ బస్సు..., తెల్లా తెల్లా చీరలోన చందమామ..(బొబ్బిలిపులి)
19. జాబిలితో చెప్పనా..(వేటగాడు)
20. రా గురూ.. (ఖైదీ రుద్రయ్య)
21. నవీనా నవీనా.. (గోవిందా గోవిందా)
22. నీ చేతులలో తలదాచి.. (కార్తీకదీపం)
23. స్వాతి చినుకు.. (ఆఖరి పోరాటం)
24. మైనే తేరీ దుష్మన్.. (నగీనా)
25. చుడియా.. (లమ్హే)
26. ఆ మేరీ జాన్.., మిత్వా.. (చాందిని)
27. ఛమ్ ఛమ్ ఛాని.. (సుహాగ్)
28. తూ ముజే సునా.. (చాందిని)
29. గోరీ తేరే అంగ్ అంగ్.. (తోఫా)
30. తూ ముజే కాబూల్.. (ఖుదాగవా).. ఇలా అనేక చిత్రాల్లోని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీదేవి మరణం : అమ్మను కోల్పోయానంటూ విలపిస్తున్న పాకిస్థాన్ నటి