Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాక్సాపీస్ గ్యాంగ్‌స్ట‌ర్.. వ‌న్ అండ్ ఓన్లీ మెగాస్టార్ : బాబీ

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (18:16 IST)
మెగాస్టార్ చిరంజీవి తన 66వ పుట్టినరోజు వేడుకలను ఆగస్టు 22వ తేదీ ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొత్త అప్డేట్‌‌తో అభిమానుల‌కు మేకర్స్ ఊపిరాడ‌కుండా చేస్తున్నారు. 
 
ఇప్ప‌టికే చిరంజీవి 153వ ప్రాజెక్టుకు "గాడ్ ఫాద‌ర్" టైటిల్‌ను ఫైన‌ల్ చేశారు. ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్ర లుక్‌తోపాటు స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి భోళా శంకర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 
 
తాజాగా మ‌రో క్రేజీ అప్ డేట్ చిరు ఫ్యాన్స్ ముందుకొచ్చింది. దర్శకుడు కేఎస్ ర‌వీంద్ర (బాబీ) మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. త‌న దర్శకత్వంలో చేస్తున్న 154వ ప్రాజెక్టు స్పెష‌ల్ లుక్ ఒక‌టి షేర్ చేసుకున్నాడు. 
 
"బాక్సాపీస్ గ్యాంగ్‌స్ట‌ర్.. వ‌న్ అండ్ ఓన్లీ మెగాస్టార్". త్వ‌ర‌లో షూటింగ్ మొద‌లు అంటూ ట్విట‌ర్ ద్వారా లుక్ షేర్ చేశాడు. చిరు ముఠామేస్త్రి స్టైల్ లో చేతిలో ఆయుధం ప‌ట్టుకొని ప‌డ‌వ అంచున నిల‌బ‌డ‌గా..ప‌క్క‌నే చాలా మంది రౌండ‌ప్ చేయడం లేటెస్ట్ లుక్ లో చూడొచ్చు.
 
మొత్తానికి చిరంజీవి ఇమేజ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను బాబీ ప్రేక్షకులకు అందించ‌బోతున్నాడ‌ని తెలిసిపోతుంది. 'పూన‌కాలు లోడింగ్'.. అంటూ బాబీ రిలీజ్ చేసిన స్టిల్ ఇపుడు ఆన్‍లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments