‘త‌రం త‌రం స్థిరం చిరంజీవ‌..’ సాంగ్‌ను రిలీజ్ చేసిన శ్రీకాంత్

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (17:30 IST)
త‌మ అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘త‌రం త‌రం స్థిరం చిరంజీవ‌..’ సాంగ్‌ను మేజిక్ యాక్సిస్‌, నౌదియాల్ మూవీ మేక‌ర్స్‌తో క‌లిసి రూపొందించిన డైరెక్ట‌ర్స్ ర‌మేశ్ గోపి. 
 
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు ఆదివారం(ఆగ‌స్ట్ 22). ఈ సంద‌ర్భంగా తెలుగు సినీ ప్రేక్ష‌కాభిమానులు మెగాస్టార్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు. కొంద‌రు సోష‌ల్ మీడియా ద్వారా చిరంజీవికి బ‌ర్త్ డే విషెష్ చెబుతుంటే.. మ‌రికొంద‌రు ప్ర‌త్యేక‌మైన‌ వీడియోల ద్వారా అభినంద‌న‌లను తెలియ‌జేస్తున్నారు. 
 
ఈ క్ర‌మంలో ద‌ర్శ‌క ద్వ‌యం ర‌మేశ్ గోపి తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ప్ర‌త్యేక‌మైన ఓ వీడియో సాంగ్‌ను ట్రిబ్యూట్‌గా రూపొందించి... త‌మ అభిమానాన్ని చాటుకున్నారు..
 
‘‘ఆకాశం వంగింది నీకై.. భూలోకం పొంగింది నీకై
అభిమాన సంద్రం నీకుంది అండ‌
ఇర‌వైలో అమ్మాయిల‌కైనా.. అర‌వైలో అమ్మ‌మ్మ‌ల‌కైనా
గుండెల్లో అనురాగం నింపే జెండా
న‌ట‌న నీ నిచ్చెన‌.. నీ సాటి నువ్వే గురు
నేల‌కే వ‌చ్చిన న‌ట‌రాజు నువ్వే చిరు
త‌రం త‌రం స్థిరం చిరంజీవ‌.. న‌రం న‌రం స్వ‌రం చిరంజీవ ’’ అంటూ సాగే ఈ పాట‌లో వివిధ సంద‌ర్భాల్లో అభిమానులు ఆయ‌న‌పై చాటుకున్న వీడియోల‌ను చూపించారు. ఒక‌వైపు చిరంజీవి న‌ట‌న‌ను, ఆయ‌న చేసిన సేవా కార్య‌క్ర‌మాల‌ను గురించి ప్ర‌స్తావించారు. 
 
మేజిక్ యాక్సిస్‌, నౌదియాల్ మూవీ మేక‌ర్స్ ప‌తాకాల‌పై రోషిణి నౌదియాల్ నిర్మించిన ఈ సాంగ్‌ను చిర్రావూరి విజ‌య్ కుమార్ రాయ‌గా, హేమ‌చంద్ర ఆల‌పించారు. శ్రీవసంత్ ఈ పాట‌కు సంగీతాన్ని అందించారు. 
 
ఇది నా ల‌వ్‌స్టోరి క్యూట్ ల‌వ్‌స్టోరితో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన త్వ‌ర‌లోనే రెడ్డిగారింట్లో రౌడీయిజం వంటి ల‌వ్ అండ్ యాక్ష‌న్ చిత్రంతో ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న డైరెక్ట‌ర్స్ ర‌మేశ్ గోపి.. ఈ పాట‌ను మెగా ఫ్యాన్స్‌తో పాటు అంద‌రికీ న‌చ్చేలా, అంద‌రూ మెచ్చేలా రూపొందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ కోసం నా భార్యను చంపాను.. ప్రియురాలికి మెసేజ్ పంపిన డాక్టర్ భర్త

వదిన పెళ్లి కోసం వుంచిన రూ.50 లక్షల విలువైన ఆభరణాలు దొంగలించిన మహిళ

Prakash Raj: మమ్ముట్టిలాంటి గొప్ప నటుడికి అలాంటి అవార్డులు అవసరం లేదు.. ప్రకాశ్ రాజ్

కరూర్ తొక్కిసలాట తర్వాత బుద్ధి వచ్చిందా.. తొండర్ అని పేరిట వాలంటీర్ల విభాగం

కొత్త అలెర్ట్: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments