Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలు విద్యార్థులకు 'మేజర్' స్పెషల్ ఆఫర్

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (07:56 IST)
అడవి శేష్ హీరోగా వచ్చిన చిత్రం మేజర్. ఇండియన్ ఆర్మీలో మేజర్‌గా సేవలు అందిస్తూ వీరమరణం పొందిన ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలపై మంచి సక్సెస్ సాధించింది. ముఖ్యంగా, ప్రతి ఒక్క సినీ సెలెబ్రిటీల మనస్సులను కదిలిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ చిత్రాన్ని చూసి చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. 
 
ఈ నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు గ్రూపు టిక్కెట్లపై రూ.50 రాయితీ ఇస్తామని హీరో అడవి శేష్ ప్రకటించారు. మేజర్ గురించి రేపటి తరానికి తెలియాలన్నదే తమ సంకల్పమని అందుకే ఈ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటిస్తున్నట్టు తెలిపారు. 
 
ఇందుకోసం పాఠశాల యాజమాన్యాలు కోరితో విద్యార్థుల కోసం ప్రత్యేక షోలు వేస్తామని, అందుకోసం majorscreening@gmail.com కు మెయిల్‌ చేసి ఈ అవకాశాన్ని పొందవచ్చని ఆయన కోరారు. ఉన్నికృష్ణన్ జీవితం గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఈ ఆఫర్ ప్రకటించినట్టు తెలిపారు. 
 
ఈ విషయాన్ని  హీరో అడవి శేష్ ఓ ట్వీట్ చేశారు. 'మేజర్' సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. చాలామంది చిన్నారులు తనకు ఫోన్ చేసి తాము కూడా మేజర్ సందీప్‌లా దేశం కోసం పోరాడతామని చెబుతున్నారని అన్నారు. 
 
చిన్నారుల నుంచి వస్తున్న స్పందన తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వారి కోసం రాయితీపై ప్రదర్శించాలని నిర్ణయించినట్టు తెలిపారు. గ్రూప్ టికెట్లపై పాఠశాలలకు రాయితీ కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. 'మేజర్' గురించి రేపటి తరానికి తెలియాలనేదే తమ లక్ష్యమని అడవి శేష్ అన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments