Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో చిత్రం

Webdunia
శనివారం, 1 మే 2021 (18:20 IST)
Mahesh 28
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అత‌డు` 16ఏళ్లుగా, `ఖ‌లేజా` 11ఏళ్లుగా ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి. రిపీటెడ్‌గా ఈ ఎవ‌ర్‌గ్రీన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ని చూసి ఎంజాయ్ చేస్తున్నవారంద‌రూ ఈ సూప‌ర్ కాంబినేష‌న్‌లో రాబోయే కొత్త సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. 
 
11ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో బిగ్గెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంద‌న్న న్యూస్ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎంతో ఆస‌క్తిని రేపుతోంది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌ (చిన‌బాబు) ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
mahsh, trivikram, chinababu
సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజైన మే31న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం అయ్యే ఈ చిత్రం 2022 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ‌వుతుంది. ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాల‌తో మ‌హేష్-త్రివిక్ర‌మ్‌ల హ్యాట్రిక్ మూవీగా రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన‌ అన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. 
 
రాబోయే చిత్రాల్లో ఒక స్పెష‌ల్ క్రేజ్ ఉన్న #SSMB28కి స‌మ‌ర్ప‌ణ: శ్రీ‌మ‌తి మ‌మ‌త‌, నిర్మాత‌: సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు), ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments