మహేష్ చేతుల మీదుగా 23న 'పెళ్లిసందD' ట్రైలర్ రిలీజ్

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (14:47 IST)
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా 'పెళ్లి సందD' సినిమా రూపొందింది. ఆర్కా మీడియా నిర్మించిన ఈ సినిమాతో, గౌరీ రోణంకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 
 
గతంలో శ్రీకాంత్ హీరోగా ‘పెళ్లి సందడి’ సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్న దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అంతేకాదు ఒక ముఖ్యమైన పాత్రను కూడా పోషించారు.
 
గతంలో ఆయనతో ‘పెళ్లి సందడి’ సినిమాకి పనిచేసిన కీరవాణి, చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్‌డేట్స్ ఆసక్తిని పెంచుతూ వెళుతున్నాయి. 
 
ఇపుడు ట్రైలర్‌‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రైలర్‌ను హీరో మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నారు. ఈ సినిమాతో శ్రీలీల తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. శ్రీకాంత్ మాదిరిగానే ఆయన తనయుడికి ఈ టైటిల్ కలిసొస్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏయ్ పండూ, మెడలో తాళి కట్టకు, వీడియో తీస్తున్నారు: యువకుడితో యువతి (video)

ఒకే ఒక్క ఓటు ఆమెను గెలిపించింది.. కోడలు కోసం ఆయన వేసిన ఓటు..?

తెలంగాణలో రెండు దశల పంచాయతీ ఎన్నికలు: విజేతగా నిలిచిన కాంగ్రెస్

Naga Babu: భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయను.. నాగబాబు క్లారిటీ

పాకిస్థాన్ వంకర బుద్ధి పోలేదు.. ఆపరేషన్ సిందూర్ 2.0 తప్పేలా లేదు : దుశ్యంత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments