Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంకటేష్ - మీనా "దృశ్యం" మూవీపై క్రేజీ అప్‌డేట్స్

Advertiesment
వెంకటేష్ - మీనా
, సోమవారం, 20 సెప్టెంబరు 2021 (17:46 IST)
మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన చిత్రం 'దృశ్యం'. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. ఈ మూవీని తెలుగులోకి హీరో వెంకటేష్, మీనా జంటగా రీమేక్ చేశారు. ఇక్కడు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మధ్య మళయాళంలో వచ్చిన ఈ సినిమా సీక్వెల్‌కి కూడా అనూహ్యమైన స్పందన లభించింది. దాంతో తెలుగులోనూ ఈ సీక్వెల్‌కి రీమేక్ చేశారు. మళయాంలో ఈ సీక్వెల్‌ని ఓటీటిలో రిలీజ్ చేశారు. 
 
ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేశారు. అయితే తెలుగులో రీమేక్ అవుతున్న దృశ్యం 2 కూడా ఓటీటీ వేదికగానే విడుదలవుతుందని గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌కి చెందిన ఒక ప్రముఖ సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, అందువలన ఈ సినిమా ఓటీటీ ద్వారానే రానుందనే టాక్ ఊపందుకుంది.
 
దీనిపై నిర్మాత సురేష్ బాబు స్పందించారు. ఇదంతా కేవలం పుకార్లు మాత్రమేనని తేల్చేశారు. ఏ విషయమైనా తామే స్వయంగా చెప్పేవరకూ ప్రచారాలు నమ్మవద్దని హితవు పలికారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సందీప్ కిషన్ తో వీఐ ఆనంద్ సినిమా లాంఛ‌నంగా ప్రారంభం