Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్షన్‌లో మహేష్ బాబు ఫ్యాన్స్, ఏమైంది..?

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (20:23 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - సక్సస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే... మూవీ రన్ టైమ్ విషయానికి వస్తే... 2 గంటల 47 నిమిషాలు.
 
అసలు రన్ టైమ్ రెండున్నర గంటలే ఉంచాలి అనుకున్నారట. అయితే... కామెడీ, ఎమోషన్ బాగా పండడంతో రన్ టైమ్ తగ్గించకుండా 2 గంటల 47 నిమిషాలకు ఫిక్స్ చేసారట. ఇది తెలిసినప్పటి నుంచి మహేష్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారట. ఎందుకంటే.. రన్ టైమ్ ఎక్కువయితే.. ఇంకా సినిమా అవ్వడం లేదు ఏంటి అనుకుంటారని.. అందువలన నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉందని. కానీ... మహేష్ బాబు గత చిత్రాల రన్ టైమ్ పరిశీలిస్తే... శ్రీమంతుడు సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. 
 
బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన శ్రీమంతుడు రన్ టైమ్ 2 గంటల 38 నిమిషాలు. ఈ సినిమా నిడివి ఎక్కువ ఉన్నా ఆడియన్స్ చూసారు.. సంచలన విజయాన్ని అందించారు. ఇక మహేష్‌ బాబు - కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన మరో భారీ చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుని ఘన విజయాన్ని సాధించింది.
 
ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 54 నిమిషాలు. రన్ టైమ్ ఎక్కువ ఉన్నా చూసారు. ఇక మహర్షి అయితే.. 3 గంటలు రన్ టైమ్. అయినా చూసారు. ఈ నమ్మకంతోనే చిత్ర యూనిట్ రన్ టైమ్ గురించి టెన్షన్ పడడం లేదట. సో.. మహేష్ ఫ్యాన్స్ రన్ టైమ్ విషయంలో టెన్షన్ పడనవసరం లేదని చిత్ర యూనిట్ చెబుతున్నారు. మరి.. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments