మహేష్ బాబు అభిమానులు ఇక కాలర్ ఎగరేసుకోవచ్చు..!

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (10:50 IST)
సూపర్‌స్టార్ మహేష్‌బాబు అనుకున్నది సాధించాడు. ఈసారి గట్టిగా కొడతానని కాలర్ ఎగరేసి మరి చెప్పిన మహేష్ అన్నంత పని చేసాడు. మహర్షి సినిమా విడుదలైన మొదటివారంలో భారీ వసూళ్లను అందుకుంది. తొలివారం ముగిసేసరికి ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా డబ్బై ఐదు కోట్ల రూపాయల వసూళ్లను కొల్లగొట్టింది. 
 
మొదటివారం వసూళ్లపరంగా ఇప్పటి వరకు టాప్ ర్యాంక్‌లు ఒక్కసారి చూసుకుంటే ఆల్‌టైం లిస్ట్‌లో మహర్షి నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో బాహుబలి రెండు భాగాలు, రంగస్థలం, ఖైదీ నెంబర్ 150 సినిమాలు నిలిచాయి. ఈ చిత్రాలన్నీ మొదటివారంలో డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వసూళ్లను రాబట్టాయి.
 
మహేష్ బాబు కెరియర్‌లో మాత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్‌లలో మహర్షి చిత్రం నెంబర్ వన్ సినిమాగా నిలిచింది. మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కిన మహర్షి నైజాంలో 21 కోట్లు రాబట్టగలిగింది. మహేష్ గత చిత్రాలు శ్రీమంతుడు, భరత్ అను నేను సినిమాలు కూడా నైజాంలో 20 కోట్లను కొల్లగొట్టాయి. ఇక ఓవర్సీస్‌లో మాత్రం కలెక్షన్‌లు కొంచెం తగ్గాయనే చెప్పాలి. లేదంటే మహర్షి బాహుబలి సినిమాల తర్వాతి ప్లేస్‌లో ఉండేది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments