Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుర్ర హీరోయిన్‌పై ఎమ్మెల్యే కన్నుపడింది...

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (10:19 IST)
టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ వయసు మీదపడుతున్నా కుర్రహీలతో పోటీపడుతూ చిత్రాలు చేస్తున్నారు. పోరాట సన్నివేశాలతో పాటు.. డ్యాన్సుల్లో కూడా ఎంతో హుషారుగా చేస్తుంటారు. 
 
అదేసమయంలో తన చిత్రాల్లో హీరోయిన్ల ఎంపికలో స్వయంగా జోక్యం చేసుకుంటారు. తనకు నచ్చితే చాలు కథతో సంబంధం లేకుండా ఆ హీరోయిన్‌ను తన చిత్రంలో బుక్ చేస్తుంటాడు. 
 
ముఖ్యగా, బాలయ్య బాబు నటించే ప్రతి చిత్రంలో ఓ సీనియర్ హీరోయిన్‌తో పాటు... కుర్ర హీరోయిన్ ఉండాల్సిందేనన్న షరతు కూడా ఉందనే ప్రచారం ఉంది. 
 
ఈ పుకార్లను నిజం చేస్తూ ఆయన ఇపుడు ఓ కుర్ర హీరోయిన్‌పై మనసుపడ్డారు. ఆమె ఎవరో కాదు "ఆర్ఎక్స్100" చిత్రంతో ఒక్కసారిగా హాట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిన పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రంలో తన అందాలను పూర్తిగా ఆరబోసింది. తాజాగా "సీత" చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో కూడా రెచ్చిపోయిందట. 
 
ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ గతంలో బాలకృష్ణతో 'జైసింహ' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించే చిత్రంలో ఓ హీరోయిన్‌గా పాయల్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి "రూలర్" అనే టైటిల్‌ను పెట్టనున్నట్టు సమాచారం. 
 
ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. వాటిలో ఒకటి పోలీస్ పాత్ర. బాలయ్య గత చిత్రాలు 'మహానాయకుడు', 'కథానాయకుడు' రెండూ బాక్సాఫీస్ వద్ద పరాజయం చెండంతో ఈ చిత్రంపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. 
 
"జైసింహా" చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో బాలయ్య అభిమానులు డీలా పడిపోయారు. దీంతో తాజా ప్రాజెక్టుపై హీరో, దర్శకుడు ప్రత్యేక దృష్టిని సారించి, హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూర్‌లో తెలుగును రెండో అధికార భాషగా గుర్తించాలి : సీఎం చంద్రబాబు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments