కె.బి.ఆర్. పార్క్ కు ఇక వెళ్ళ‌కూడ‌ద‌నుకున్న మ‌హేష్‌బాబు ఎందుకంటే!

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (20:01 IST)
balayya-Mahesh
ఎవ‌డు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో.. అత‌డే.. అంటూ నంద‌మూరి బాల‌కృష్ణ అన‌గానే న‌డుచుకుంటూ వ‌స్తుంటాడు మ‌హేష్‌బాబు. ఇది బాల‌కృష్ణ ఓటీటీకి కోసం చేస్తున్న `అన్ స్టాప‌బుల్‌` ప్రోగ్రామ్‌. గ‌త నెల‌లో షూట్ చేసిన ఈ ఎపిసోడ్ ఫిబ్ర‌వ‌రి 4న టెలికాస్ట్ కానుంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం రాత్రి ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లు వున్నాయి. స‌ర‌దాగా సాగిన వాటిల్లో కొన్ని మీకోసం..
అస‌లు మహేష్ ఎవ‌రు?
నేను ఫాద‌ర్‌లా వుంటాను.
ఇంటిలో కేట్ ఎవ‌రు?  బ్రాట్ ఎవ‌రు?
గౌత‌మ్ కేట్‌, సితార బ్రాట్‌
నాన్న‌గారు సెటైర్‌గా వుంటారు? మ‌రి మీరు?
నేనూ సెటైర్‌గా వుంటా. నా టైమింగ్‌లో వుంటుంది.
కె.బి.ఆర్. పార్క్‌లో ఏం జ‌రిగింది?
ఒక‌రోజు కె.బి.ఆర్‌. పార్క్‌లో ఫుల్ రౌండ్ వేసి చివ‌రికి వ‌చ్చాక ఆగాను. ఎదురుగా పాము ఇలా తిరిగింది. అది చూసి ఐదు కిలోమీట‌ర్లు ర‌న్నింగ్ చేశా. మ‌ళ్ళీ కెబి.ఆర్‌. పార్క్‌కు వెళ్ళ‌లేదు.
ఎవ‌రో నిన్ను లెక్క‌చేయ‌లేద‌ట‌?
అది భ‌ర‌త్ అనే నేను సినిమా షూటింగ్‌. కెమెరా ఫ్రంట్ రోల్‌లో ప్లే అవుతుంది. సీరియ‌స్‌గా డైలాగ్‌లు చెబుతున్నా. ఒకావిడ ఫోన్‌లో గేమ్‌లు అడుకుంటుంది. ఏమ్మా! ఫోన్ ఆఫ్ చేయి అన్నా. అదే మీరైతే మైక్ విసిరేసేవారు.
1000మంది గుండె ఆప‌రేష‌న్‌లు చేసి పేద‌ల గుండెల్లో నిలిచిపోయారే?
గౌత‌మ్ ఆరునెల‌ల ముందుగానే పుట్టాడు. నా అర‌చేయి అంత వున్నాడు. మాకు డ‌బ్బులున్నాయి. ఓకే. చాలామంది పరిస్థితి ఏమిటి? అనే ఆలోచ‌నే ఇలా సేవ చేయ‌డం మొద‌లుపెట్టాను.
ఇంకా పూర్తి వివ‌రాలు ఫిబ్ర‌వ‌రిలో చూడాల‌న్న‌మాట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments